Gangavva: గంగవ్వ ఇటీవల ఓ యూట్యూబ్ వీడియో చేసింది. సదరు వీడియోలో తన ఆస్తుల చిట్టా విప్పింది. గంగవ్వ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో గల లంబాడిపల్లి అనే మారుమూల గ్రామంలో ఉంటుంది. వ్యవసాయం ఆమె వృత్తి. పాత పెంకుటింట్లో ఒంటరిగా ఉండేది. ఆమె చేష్టలు, మాటలు భిన్నంగా ఉంటాయి. ఈ క్రమంలో మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ లో ఆమె వీడియోలు పోస్ట్ చేశారు. వాటికి విశేష ఆదరణ దక్కింది. గంగవ్వ సోషల్ మీడియా స్టార్ గా అవతరించింది.
ఈ క్రమంలో గంగవ్వకు బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్ట్ చేసే అవకాశం వచ్చింది. పక్కా పల్లెటూరు వాతావరణంలో పెరిగిన గంగవ్వ నాలుగు గోడల మధ్య కృత్రిమ వాతావరణంలో ఉండలేకపోయింది. దాంతో కొన్ని వారాల అనంతరం ఎలిమినేట్ కాకుండానే బిగ్ బాస్ హౌస్ వీడింది. మంచి ఇల్లు నిర్మించుకోవాలనేది తన కలగా చెప్పిన గంగవ్వ, ఆ డబ్బుల కోసమే బిగ్ బాస్ షోకి వచ్చినట్లు హోస్ట్ నాగార్జునతో చెప్పింది.
గంగవ్వ హౌస్లో ఎక్కువ వారాలు ఉండకున్నా నాగార్జున, స్టార్ మా కలిసి ఆమె కొత్త ఇంటి నిర్మాణానికి డబ్బులు సమకూర్చారు. రూ. 22 లక్షలతో గంగవ్వ తన ఊరిలో ఇల్లు నిర్మించుకుంది. రూ. 3 లక్షలతో ఆవుల్ని కొని, వాటి కోసం షెడ్ నిర్మించింది. తన ఊరిలోనే నాలుగు కుంటల పొలాన్ని గంగవ్వ కొన్నదట. దాని ప్రస్తుత విలువ రూ. 9 లక్షలు అట. అలాగే గంగవ్వకు మరో చోట రూ. 80 లక్షల విలువ చేసే రెండున్నర ఎకరాల పొలం ఉందట.
రూ. 3 లక్షల రూపాయలతో ఒక కమర్షియల్ ఫ్లాట్ కొనుగోలు చేసిందట. అలాగే మరో చోట ఆమెకు 15 కుంటల పొలం ఉందట. దాని విలువ రూ. 7-8 లక్షలు ఉంటుందట. మొత్తంగా తన ఆస్తుల విలువ రూ. 1.24 కోట్లు ఉంటుందని గంగవ్వ చెప్పుకొచ్చింది. గంగవ్వకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారట. వారికి రూ. 2 లక్షల చొప్పున ఇచ్చిందట. అలాగే ఒక మనవరాలికి రూ. 2.5 లక్షలు ఇచ్చిందట.
ఒక 50 ఆవులను కొని, వాటి పాలు అమ్ముకుంటూ జీవించాలి అనేది గంగవ్వ కోరిక అట. గంగవ్వ నటిగా కూడా రాణిస్తుంది. లవ్ స్టోరీ, రాజ రాజ చోరతో పాటు పలు చిత్రాల్లో ఆమె నటించారు. సోషల్ మీడియా స్టార్ గా పాప్యులర్ అయ్యాక గంగవ్వ ఇన్ని ఆస్తులు సంపాదించిందట.
Web Title: Do you know the value of gangavva property
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com