Chiranjeevi Birthday: చిరంజీవి నట ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి దాయకం. ఎలాంటి సినిమా నేపథ్యం లేని చిరంజీవి కృషి, పట్టుదలతో హీరోగా ఎదిగాడు. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా సిల్వర్ స్క్రీన్ పై తన ముద్ర వేశారు. ప్రాణం ఖరీదు చిరంజీవి మొదటి చిత్రం. కెరీర్ ప్రారంభంలో చిరంజీవి సపోర్టింగ్, విలన్ రోల్స్ సైతం చేశారు. స్టార్ హీరో కావాలంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చిరంజీవి భావించాడు. టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ గా అవతరించాడు.
భరత నాట్యంలో శిక్షణ తీసుకున్న చిరంజీవికి మోడ్రన్ డాన్సులు చేయడం చాలా సులభమైంది. డాన్సుల్లో చిరంజీవి ట్రెండ్ సెట్టర్. చిరంజీవికి ముందు ప్రొఫెషనల్ గా డాన్స్ చేసిన హీరోలు లేరు. చిరంజీవి కెరీర్ ని ఖైదీ కి ముందు ఆ తర్వాత అని చెప్పొచ్చు. ఖైదీ చిరంజీవికి స్టార్డం తెచ్చిన చిత్రం. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఖైదీ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. అక్కడి నుండి చిరంజీవి వెనక్కి తిరిగి చూసుకోలేదు.
దేశంలో కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరో చిరంజీవి. 1992లోనే చిరంజీవి కోటి తీసుకున్నారు. అప్పటికి అమితాబ్ బచ్చన్ రెమ్యూనరేషన్ కూడా అంత లేదు. అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో అంటూ చిరంజీవి పేరిట ఆంగ్ల మ్యాగజైన్ కథనం ప్రచురించింది. చిరంజీవి ఇప్పటి వరకు 150 కి పైగా చిత్రాలు చేశాడు. గత రెండేళ్లలో చిరంజీవి నుండి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి.
ప్రస్తుతం చిరంజీవి సినిమాకు రూ. 40 నుండి 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక చిరంజీవి ఆస్తుల వివరాలు పరిశీలిస్తే… జూబ్లీహిల్స్ లో చిరంజీవికి లగ్జరీ హౌస్ ఉంది. అత్యాధునిక హంగులతో విశాలంగా నిర్మించిన ఈ లగ్జరీ హౌస్ ని చిరంజీవి రూ. 30 కోట్లతో నిర్మించాడని సమాచారం. దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 50 కోట్లకు పైమాటే.
చిరంజీవికి బెంగళూరులో ఓ ఫార్మ్ హౌస్ ఉంది. అలాగే చెన్నైలో ఖరీదైన ప్రదేశాల్లో ఇళ్ళు ఉన్నాయి. చిరంజీవి వద్ద లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది. వాటిలో రోల్స్ రాయిస్ చాలా ప్రత్యేకం. ఆడి, బెంజ్, రేంజ్ రోవర్, టొయోటా హై ఎండ్ కార్స్ చిరంజీవి కార్ కలెక్షన్స్ లో ఉన్నాయి. చార్టెడ్ ఫ్లైట్ ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో చిరంజీవి ఒకరు. దేశంలో ఎక్కడికి వెళ్లాలన్న చిరంజీవి కుటుంబం ఈ చార్టెడ్ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తారు.
ఒక అంచనా ప్రకారం చిరంజీవి ఆస్తుల విలువ రూ. 2 వేల కోట్లు. రామ్ చరణ్, ఉపాసన ఆస్తులు కలిపితే ఆ కుటుంబ సంపద విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రం చేస్తున్నారు.