Prabhas Maruthi Film: రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు బిజీ హీరో ప్రభాస్ తప్ప మరెవరూ లేరనే చెప్పచ్చు. ఎందుకంటే ఆయన లేటేస్టుగా నటించిన ‘ఆదిపురుష్’ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మరోవైపు ప్రభాస్ సలార్, ప్రాజక్ట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవే కాకుండా మారుతి డైరెక్షన్లో ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికే 20 శాతం పూర్తయినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు ఇప్పటి వరకు ‘రాజా డీలక్ష్’ అనే టైటిల్ నుఅనుకున్నారు. కానీ తాజాగా మరో రెండు టైటిల్స్ అనుకుంటున్నట్లు సమాచారం. అవేంటేంటే.
ప్రభాస్-మారుతి డైరెక్షన్లో సినిమా కొన్ని నెలల కిందటే అనౌన్స్ అయింది. మిగతా సినిమాల్లో నటిస్తూనే మారుతి సినిమా కోసం పనిచేస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీ పూర్తిగా హర్రర్ నేపథ్యంలో కొనసాగే అవకాశం ఉంది. ఇందులో శ్రీలీలతో పాటు మాళవిక మోహన్ నటిస్తున్నట్లు అధికారికంగానే ప్రకటించారు. అయితే ప్రభాస్ అనగానే భారీ బడ్జెట్ చిత్రం అని అందరూ ఊహించుకుంటున్నారు. కానీ మారుతితో చేయబోయేది చిన్న సినిమానే అని అంటున్నారు. ఓ భవనంలో మాత్రమే ఈ సినిమా కొనసాగుతుందని అంటున్నారు.
ఇప్పటి వరకు ఈ మూవీకి ‘రాజా డీలక్స్’ అని అనుకున్నారు. కానీ తాజాగా మరో రెండు టైటిల్స్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి ‘రాయల్’ కాగా.. మరొకటి ‘అంబాసిడర్’ అని తెలుస్తోంది. అయితే ఫైనల్ గా ఈరెండింటిలోనే ఏదో ఒకటి ఫిక్ష్ చేస్తారని అంటున్నారు. ‘అంబాసిడర్’ అనేది కారు నామకరణం. దీనిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా ఏది ఖరారు అవుతుందో చూడాలి.
ప్రభాస్ లేటేస్టుగా నటించిన ఆదిపురుష్ వసూళ్ల సునామీ కొనసాగిస్తోంది. 10 రోజుల్లో ఈ మూవీ 240 కోట్లకు పైగా సాధించిందని తెలుస్తోంది. మరోవారం ఇలాగే కొనసాగితే సినిమా లాభాల బాట పడినట్లేనని అంటున్నారు. ఇప్పుడొచ్చిన సినిమాల్లో పెట్టుబడులు రావడమే కష్టంగా మారుతోంది. కానీ ప్రభాస్ మార్కెట్ పాన్ ఇండియా లెవల్లో హై లెవ్లలో ఉందని అంటున్నారు. దీంతో తరువాత సినిమాలు ఎలా ఉంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.