HIT 2 Movie: అడవి శేష్ థ్రిల్లర్ మూవీస్ కి ఆడియన్స్ లో మాములు క్రేజ్ లేదు..క్షణం, ఎవరు , గూడాచారి ఇలా ఆయన చేసిన థ్రిల్లర్ జానర్ మూవీస్ అన్ని విశేష ఆదరణ పొందాయి..అడవి శేష్ కి ఒక బ్రాండ్ వేల్యూ తెచ్చి, ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని తీసుకొచ్చాయి ఈ సినిమాలు..అలాంటి హీరో నుండి మేజర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఒక పాపులర్ థ్రిల్లర్ సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడంటే ప్రేక్షకుల్లో సాధారణంగానే అంచనాలు ఎక్కువ ఉంటాయి.

అలా అంచనాలను అమాంతం పెంచేసిన అడవి శేష్ లేటెస్ట్ చిత్రం హిట్ 2 ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..న్యాచురల్ స్టార్ నానీ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం విడుదలకి ముందే టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది..ఇక విడుదలైన తర్వాత కూడా మొదటి ఆట నుండే ఈ సినిమా ఆ అంచనాలను అందుకొని సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమాలో ఎవ్వరు ఊహించని మరియు గమనించని కొన్ని విశేషాలను ఇప్పుడు మేము ఈ స్టోరీ లో మీ ముందు ఉంచబోతున్నాము..సినిమా ప్రారంభం లో ఒక అమ్మాయి శవం దొరుకుతుంది..హంతకులను చాలా తేలికగా పట్టుకునే టాలెంట్ ఉన్న హీరో కి ఈ కేసు ని ఒక గంటలోపు పరిష్కరిస్తాను అని సవాలు విసురుతాడు..కానీ దొరికిన అమ్మాయి శరీరం ఒక్క అమ్మాయిది కాదని..సిటీ లో సైకో కిల్లర్ చేత అలా వరుసగా మర్డర్స్ కి గురైన అమ్మాయిల శరీరం తో కూడినదని తెలిసేలోపు హీరోకి మాత్రమే కాకుండా, ఆడియన్స్ కి కూడా మైండ్ బ్లాక్ అవుతుంది..ఇక విలన్ ఎవరు అనేది ఊహించడం చాలా కష్టం.

ఆ సస్పెన్స్ ని మైంటైన్ చెయ్యడం లో డైరెక్టర్ నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు..ట్రైలర్ ని చూసి చాలా మంది నెటిజెన్స్ హీరోయిన్ మీనాక్షియే విలన్ అని అందరూ అనుకుంటారు..కానీ నిజంగా ఆమెనే విలనా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..ఇక ఈ సినిమా ప్రొమోషన్స్ లో మొదటి నుండి హిట్ 3 హీరో ఎవరో చూపిస్తామని మేకర్స్ చెప్తూనే వస్తున్నారు.
ఇంతకీ ఆ హీరో ఎవరు ఏమిటి అనేది నెటిజెన్స్ ఆరాలు తీస్తారు..కానీ ఆ హీరో మరెవరో కాదు..ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన న్యాచురల్ స్టార్ నానీనే..సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా ఉన్నప్పటికీ..సెకండ్ హాఫ్ మాత్రం ఫ్యూజులు ఎగిరిపోయ్యే ట్విస్ట్స్ తో ప్రేక్షకుల్లో ఉత్కంఠని నెలకొల్పేందుకు డైరెక్టర్ శైలేష్ చేసిన ప్రయత్నం నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యింది..చూడాలిమరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా ఏ రేంజ్ కి వెళ్తుందో అనేది.