Sukumar Remuneration: ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన అతి కొద్దీ మంది టాలీవుడ్ దర్శకులలో ఒకరు సుకుమార్, ఆర్య సినిమా తో కెరీర్ ని ప్రారంభించిన ఈయన తన క్రియేటివిటీ తో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ఆడియన్స్ కి అందించాడు. ఈయన టచ్ చేసే కాన్సెప్ట్స్ ఇండియా లో ఏ స్టార్ డైరెక్టర్ కూడా ముట్టుకోడు. కథ , కథనం , డైలాగ్స్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఎంతో కొత్తగా ఉంటాయి.
ముఖ్యంగా ఈయన సినిమాల్లోని క్లైమాక్స్ లు ట్విస్టులతో కూడుకున్న విధంగా, ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేసే విధంగా ఉంటాయి. ముఖ్యంగా రంగస్థలం సినిమా క్లైమాక్స్ సన్నివేశాన్ని తెలుగు ఆడియన్స్ ఇప్పట్లో మర్చిపోలేరు.ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీసిన పుష్ప సినిమాతో హీరోయిజం కి సరికొత్త నిర్వచనం తెలిపాడు సుకుమార్. ఇప్పుడు ఆయన తీస్తున్న ‘పుష్ప : ది రూల్’ కోసం ఇండియా మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది.
ఇది ఇలా ఉండగా సుకుమార్ తనతో పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ, తాను రాసిన కథలను కానీ, స్క్రీన్ ప్లే ని కానీ ఇస్తూ ఉంటాడు. అలా టాలీవుడ్ కి ఎంతో మంది డైరెక్టర్స్ ని పరిచయం చేసాడు, రీసెంట్ గా విరూపాక్ష చిత్రం ద్వారా కార్తీక్ దండు అనే అతనిని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. ఈమధ్యనే విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సునామి ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
కేవలం నాలుగు రోజుల్లోనే 24 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి, 50 కోట్ల రూపాయిల షేర్ వైపు పరుగులు తీస్తుంది. ఈ చిత్రానికి కథ అందించింది కార్తీక్ దండు అయ్యినప్పటికీ, స్క్రీన్ ప్లే అందించినందుకు గాను సుకుమార్ ఆరు కోట్ల రూపాయిల పారితోషికం ని అందుకున్నాడట. కేవలం స్క్రిప్ట్ రైటింగ్ కోసం ఇంత రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక డైరెక్టర్ గా సుకుమార్ హిస్టరీ లో నిలిచిపోయాడు.