Singer Mangli Remuneration: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహాపురుషులవుతారని ఓ సినీ కవి అన్నారు. అక్షరాల ఇది నిజమే. పేదరికంలో పుట్టడం తప్పుకాదు కానీ పేదవాడిగా చస్తే తప్పు. మనిషికున్న తెలివితేటలతో ఎన్నో అద్భుతాలు సృష్టించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రతి మనిషికి మెదడు 1350 గ్రాములే ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోవడంలోనే మన తెలివితేటలు ఆధారపడి ఉంటాయి. చీకటిలో కూర్చుని తిట్టుకునే కంటే ఆ చీకటిలో చిరుదీపం వెలిగించడం మంచిదనేది సామెత. దీంతో మనకు అవకాశాలు రాలేదని బాధపడకుండా కొత్తగా చాన్సులు తెచ్చుకుని మన సామర్థ్యం చూపించుకోవడంలోనే మన శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉంటాయి.

తాజాగా గాయనిగా స్థిరపడిన మంగ్లీ జీవితం కూడా ఒక్క రోజులో ఎదిగింది కాదు. ఆమె మొదటి సంపాదన నెలకు రూ. 5 వేలు. కానీ ప్రస్తుతం ఎంతో మనకు తెలియదు. కానీ భారీగానే పారితోషికం అందుకుంటోంది. ఒక్కో పాటకు రూ. 5 లక్షల వరకు తీసుకుంటుందని అంచనా. ఈ క్రమంలో ఆమె తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీవితంలో స్థిరపడింది. తీన్మార్ వార్తలతో వెలుగులోకి వచ్చిన ఆమెకు ప్రస్తుతం ఎంతో క్రేజీ ఏర్పడింది. సినిమాల్లో పాటలు పాడుతూ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది.
చానల్స్ ఎన్నో మారినా తన గొంతులో ఓ మాధుర్యం ఉందని లోకానికి చాటిచెప్పింది. బతుకమ్మ పాటల్లో మంగ్లీ పాటలే ఎక్కువగా ఉండటం విశేషం. దీంతో ఆమె ప్రస్థానం ఎంతో ఎత్తుకు ఎదిగింది. గొంతు సవరించుకుని పాట ఎత్తుకుందంటే ఇక అది పరుగులు పెట్టాల్సిందే. తన గళంతో అందరిని మైమరపింపజేస్తోంది. పాటకు ప్రాణం పోస్తోంది. గొంతులో కోకిల లాంటి మాధుర్యం ఉండటంతో ఆమె పాటలకు గుర్తింపు కూడా అదే రేంజ్ లో వస్తోంది. మొదట సింగర్ గా పరిచయం అయినప్పుడు కేవంల రూ. 10 వేలు ఇచ్చేవారట. కానీ ఇప్పుడు అది ఎంతో ఎత్తుకు ఎదగడం విశేషం.

తన పాటలు సామాజిక మాధ్యమాల్లో పెడితే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. దీంతో కూడా ఆమెకు ఎంతో ప్రచారం పెరుగుతోంది. దీని ద్వారా కూడా రూ. లక్షల్లో ఆదాయం వస్తోంది. ఈ క్రమంలో మంగ్లీ తన మాధుర్యమైన గొంతుతో పాటలు పాడుతూ ఔరా అనిపించుకుంటోంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు మిత్రమా అన్నట్లు తన ప్రతిభను తానే నిరూపించుకుంది. తన గొంతును సవరించుకుని అదృష్టాన్ని మార్చుకుంది. యాంకర్ మంగ్లీ కాస్త గాయని మంగ్లీగా స్థిరపడింది. అదే కలిసి వచ్చే కాలం అంటే. మన దశ తిరిగితే దురదృష్టమైనా అదృష్టంగా మరుతుందనడంలో అతిశయోక్తి లేదు.
Also Read:Nandamuri Balakrishna: హీరో నందమూరి బాలక్రిష్ణపై కేసు పెట్టిన హిజ్రాలు.. షాకింగ్ కారణం
[…] […]
[…] […]