Prabhas Adipurush- Om Raut: ప్రభాస్ కెరీర్ లో మరో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతుంది ఆదిపురుష్. అలాగే ఈ మూవీ ప్రభాస్ కి చాలా స్పెషల్. కారణం ప్రభాస్ మొదటిసారి మైథలాజికల్ మూవీ చేస్తున్నారు. అందులోనూ ప్రతిష్టాత్మకమైన రాముని పాత్రలో నటిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆదిపురుష్ విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ రికార్డు థియేటర్స్ లో విడుదల కానుంది. సినిమా విడుదలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ భారీ ఎత్తున ప్లాన్ చేశారు.

Prabhas Adipurush- Om Raut
ఆదిపురుష్ రామాయణ గాథ నేపథ్యంలో హిందువుల సెంటిమెంట్ క్యాష్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. దీనిలో భాగంగా… అక్టోబర్ 2న రామ జన్మభూమి అయోధ్యలో టీజర్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. నేడు ఆదిపురుష్ నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రామునిగా ప్రభాస్ లుక్ అదుర్స్ అని చెప్పాలి. అలాగే ఆయన లుక్ కొంచెం భిన్నంగా ఉంది.
కోరమీసంతో రౌంద్రగా ప్రభాస్ శత్రువుల పైకి విల్లు ఎక్కుబెట్టారు. కాగా ఆదిపురుష్ చిత్రాన్ని బాలీవుడ్ కి చెందిన ఓం రౌత్ తెరకెక్కిస్తున్న విషయముల తెలిసిందే. మరి అక్కడ అంత మంది హీరోలు ఉండగా రాముని పాత్ర కోసం ప్రభాస్ ని ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదిపురుష్ హీరోగా ప్రభాస్ ని మాత్రమే ఎంచుకోవడానికి కారణం ఏమిటనే ప్రశ్న చాలా మంది మెదళ్లను తొలుస్తోంది. అయితే ఓ సందర్భంలో ఓం రౌత్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

Prabhas Adipurush- Om Raut
ఓం రౌత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. డార్లింగ్ ప్రభాస్ అంగీకరించకపోతే ఆదిపురుష్ వంటి బడా ప్రాజెక్ట్ సాధ్యమయ్యేది కాదు. ఈ చిత్రానికి ప్రభాస్ వన్ అండ్ ఓన్లీ ఛాయిస్. ఆదిపురుష్ స్క్రిప్ట్ మదిలో అనుకున్నప్పుడు నాకు మదిలో మెదిలిన హీరో ప్రభాస్. ప్రభాస్ గారిది స్వచ్ఛమైన హృదయం. ఈ సినిమాకు హీరోగా ఎంచుకోవడానికి అది కూడా ఒక కారణం. ప్రభాస్ కాదంటే ఈ ప్రాజెక్ట్ నేను చేసేవాడిని కాదేమో, అని ఓం రౌత్ తెలియజేశారు. అంటే కేవలం ప్రభాస్ కోసం ఆదిపురుష్ స్క్రిప్ట్ రాసుకున్నట్లు, ఆయనే ఈ సినిమాకు సరైన ఎంపికని దర్శకుడు తెలియజేశారు. ఆదిపురుష్ మూవీలో సీతగా కృతి సనన్, లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు.
Also Read: Anil Ravipudi- Balakrishna: బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా బడ్జెట్ ఇదే.. పైగా అమెరికాలో షూటింగ్