Pawan Kalyan Pepsi Ad: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాదు , సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఏ స్టార్ హీరో కి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ ఆయనతో సరిసమానమైన ఫ్యాన్ బేస్ ని కేవలం 7 సినిమాలతోనే రప్పించుకున్నాడు అంటే, యూత్ లో ఆయన ప్రభావం ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
అప్పట్లో సౌత్ ఇండియా మొత్తం మీద పెప్సీ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నిల్చిన మొట్టమొదటి హీరో ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే, ఆయన తర్వాతే చిరంజీవి థమ్స్ అప్ కూల్ డ్రింక్ కి యాడ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ బొమ్మ చూసి అప్పట్లో పెప్సీ కూల్ డ్రింక్స్ సేల్స్ రికార్డు స్థాయిలో ఉండేవి.
ఒక్క యాడ్ లో ఆయన నటించినందుకు గాను కోటి రూపాయలకు పైగా పారితోషికం కూడా ఇచ్చేవారట.అప్పట్లో మన స్టార్ హీరోలకు ఒక సినిమాకి రెండు నుండి మూడు కోట్ల రూపాయిలు మాత్రమే తీసుకునేవారు.అంతే కాదు ఇప్పుడు కమర్షియల్ యాడ్స్ చేస్తున్న హీరోలకు కేవలం కోటి నుండి రెండు కోట్ల రూపాయిలు మాత్రమే ఇస్తున్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్ కి కేవలం ఒక్క నిమిషం యాడ్ కోసం కోటి రూపాయలకు పైగా 20 ఏళ్ళ క్రితం ఇచ్చారంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో, ఆయనకీ ఇండస్ట్రీ లో ఎలాంటి బ్రాండ్ ఇమేజి ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంత సంపాదన ఇచ్చే బ్రాండ్ యాడ్ అయ్యినప్పటికీ కూడా కూల్ డ్రింక్స్ లో విష పదార్దాలు కలుస్తున్నాయని, కేవలం కూల్ డ్రింక్స్ తాగి ఎంతో మంది చనిపోయారని వార్తలు రావడం తో పవన్ కళ్యాణ్ యాడ్స్ ఇవ్వడం మానేసాడు.అంత సంపాదన ఇచ్చే బ్రాండ్ ని కూడా వదిలేసాడంటే ఆయన గొప్ప మనసు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.