R Narayana Murthy: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరో ఒక్కో స్టైల్ ను ఫాలో అవుతూ సినిమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది యాక్షన్ సినిమాలు చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం ఆర్ట్ సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ అప్పట్లో ఉన్న హీరోలందరిలో ఆర్. నారాయణమూర్తి భిన్నంగా సినిమాలు చేస్తు సక్సెస్ లు అందుకునే వాడు. ఆయన కమ్యూనిస్టు భావాలతో ఉన్న సినిమాలను ఎక్కువగా చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా ఆయన నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాడు.
ఒకప్పుడు ఎర్రజెండా కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు బడుగు బలహీన వర్గాలను ఆదరించడానికి నక్సల్స్ వచ్చి జనాలు ఆదరిస్తారనే భావనలో జనాలు ఎక్కువగా ఉండేవారు. అందుకే దాన్ని క్యాష్ చేసుకుంటూనే వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఆయన పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయాడు. దానికి కారణం ఏంటి అంటే తనే సినిమా ఇండస్ట్రీలో అనేక ఇబ్బందులు పడుతూ ఉంటున్నాడు.
దానివల్ల మరొకరిని పెళ్లి చేసుకొని ఇబ్బంది పెట్టడం తనకి ఇష్టం లేక పెళ్లి చేసుకోలేదని ఒకానొక ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు. నిజానికి నారాయణమూర్తి ఒక అమ్మాయిని విపరీతంగా లవ్ చేశాడట. ఆమె పెళ్లి చేసుకుందామని అడిగినప్పటికీ ఈయన మాత్రం పెళ్లి మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.
కానీ ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేదని చాలా సార్లు బాధపడినట్టుగా కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక ఇప్పుడు మాత్రం ఆయనకి ఎవర్ని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేక తనే ఒంటరిగానే సినిమాలను చేసుకుంటూ తన లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే వెరే వాళ్ల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించమని అడిగిన కూడా తను నటించ కుండా తను సొంతంగా సినిమా చేయడం కోసం స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉంటున్నాడు.