Pawan Kalyan And Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదనే చెప్పాలి. అయిన సినిమా కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు యూత్ అందరిని ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. అందుకే పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరికి విపరీతమైన ఇష్టం ఉండడంతో పాటు ఆయన పట్ల ప్రతి ఒక్కరు ప్రేమను కూడా చూపిస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ చాలామంది డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ మన ఇండస్ట్రీ లో దర్శక ధీరుడు గా పేరు పొందిన రాజమౌళి తో మాత్రం ఆయన ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు.
ఇక ఆయన పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా ఉత్సాహాన్ని చూపించినప్పటికీ అది వీలు కాలేదు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజమౌళితో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ సినిమాల మీద ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించలేడు. రాజమౌళి తో సినిమాకి కమిట్ అయితే దాదాపు మూడు సంవత్సరాల పాటు రాజమౌళి కాంపౌండ్ లోనే ఉండాలి. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకునే పవన్ కళ్యాణ్ కి అన్ని రోజులు ఒకే సినిమా మీద కేటాయించడం అనేది ఇంట్రెస్ట్ ఉండదు.
కాబట్టి వీళ్లిద్దరి మధ్య కాంబినేషన్ అనేది కుదరలేదు ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి ఉన్న కమిట్ మెంట్స్ ప్రకారం అయితే ఇది అసలు వీలు కాదు ఎందుకంటే ఆయన అటు పొలిటికల్ గా జనసేన పార్టీ నడుపుకుంటూనే ఇటు సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఈ రెండింటి వల్ల ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రాజమౌళితో సినిమా చేసే అవకాశాలు లేవు ఇంతకుముందు ఒకటి రెండు సార్లు అవకాశాలు వచ్చిన కూడా అప్పుడు వీలు కాలేదు ఇక ఇప్పుడైతే ఇంకా అసలే వీలు కాదు…
ఇక ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు తో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. కాబట్టి రాజమౌళి కి ఉన్న కమిట్ మెంట్స్ కి ఇప్పుడు వేరే హీరోలతో సినిమా చేసే అవకాశం అయితే లేదు అన్నట్టుగా తను ముందుకు దూసుకెళ్తున్నాడు. అలాగే తనతో సినిమా చేయాలంటే కచ్చితంగా మూడు సంవత్సరాలు ఆ సినిమా మీద కేటాయించే హీరో కావాలి కాబట్టి తనకి అనుకూలంగా ఉన్న హీరోలతోనే తను సినిమా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాన్ వరల్డ్ లో మరోసారి రాజమౌళి తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు…