Varun Tej Lavanya Tripathi- Pawan Kalyan: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం కి సంబంధించిన ఫొటోలే కనిపిస్తున్నాయి. ఒకరికోసం ఒకరు పుట్టినట్టు గా అనిపిస్తున్న ఈ జంట ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. అంత కాదు మెగా ఫ్యామిలీ హీరోలు మొత్తం ఒకే చోట కనిపించడం తో చూసేందుకు కనుల పండుగా లాగ అనిపిస్తుంది. ఇకపోతే ఈ నిశ్చితార్ధ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈయన నిన్న అందరికంటే ఆలస్యం గా నిశ్చితార్ధ వేడుకలో పాల్గొన్నాడు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో #OG మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్, షాట్స్ చిత్రీకరణ ఆలస్యం అవ్వడం తో బాగా రాత్రి అయిపోయింది. ఆయన వచ్చే లోపే వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి రింగ్స్ మార్చేసుకున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ కి శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఫ్లవర్ బొకే అందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నేరుగా #OG మూవీ షూటింగ్ లొకేషన్ నుండి వచ్చేసినట్టు ఉన్నాడు. ఆయన లుక్ కూడా #OG మూవీ లోనిదే అని అంటున్నారు ఫ్యాన్స్. అక్కడక్కడా తెల్లని జుట్టు కూడా మనం ఈ ఫొటోలో గమనించొచ్చు. అయితే ఈ వేడుక లో ఆయన ధరించిన చొక్కా ధర , ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ చొక్కా ధర సుమారుగా పది లక్షల రూపాయిల వరకు ఉంటుందని అంచానా, అంటే ఒక మధ్య తరగతి కుటుంబం ఒక చిన్న సైజు ఇల్లుని నిర్మించుకోవచ్చు అన్నమాట. ఎవరైనా కొనాలి అనుకుంటే వెంటనే కొనేయొచ్చు. ఇక పోతే పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు హైదరాబాద్ లో #OG మూవీ మూడవ షెడ్యూల్ లో పాల్గొని ఈ షెడ్యూల్ కి సంబంధించిన తన పార్ట్ ని పూర్తి చేసాడు. 14 వ తారీఖు నుండి ఆయన వారాహి యాత్ర ని ప్రారంభిస్తున్నాడు.