Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా అంటే ఫ్యాన్స్ కు పండగే. మహేష్ బాబు కెరీర్ రెండోసారి టర్న్ కావడానికి ‘అతడు’ మూవీనే కారణం. ఈ మూవీని త్రివిక్రమ్ అందించారు. ఆ తరువాత ఖలేజా కూడా ప్లస్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో వీరి కాంబినేషన్లో ‘గుంటూరు కారం’ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఇందులో మహేష్ మాస్ మసాలా హీరోగా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు హాట్ లేడీ శ్రీ లీల ఇందులో హీరోయిన్ గా ఉండడంతో సినిమాపై హైప్ క్రియేట్ అవుతున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా మహేష్ బాబు వేసుకున్న చెప్పుల గురించి ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది.
దసరా పండుగ నేపథ్యంలో ‘గుంటూరు కారం’ కు సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చారు. త్వరలో గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతకంటే ముందుగా పండుగ నేపథ్యంలో ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ బాబు ఓ వెహికల్ వెనకాల కూర్చొని సిగరెట్ తాగుతూ ఉన్నాడు. ఓ ఫైట్ కు ముందు మహేష్ బాబు స్టిల్ అని పోస్టర్ ను చూస్తే తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబు చాక్లెట్ కలర్ ప్యాంట్ వేసుకొని బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు. అలాగే కాళ్లకు సైండీలు వేసుకున్నాడు.
ఇప్పుడంతా ఆ చెప్పుల గురించి హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. మహేష్ వేసుకున్న ఆ చెప్పులు చాలా కాస్ట్లీ అని కొందరు అంటున్నారు. ఎకో అప్రోడ్ అనే కంపెనీ ఈ చెప్పులను తయారు చేసిందట. ఖరీదైన వ్యక్తులు మాత్రమే వేసుకునే దీనిని రూ.7,999తో అమ్ముతున్నారు. మొన్నటి వరకు మహేష్ వేసుకున్న షర్ట్, ప్యాంట్ పై ఆసక్తికరంగా చర్చలు పెట్టారు. ఇప్పుడు ఆయన వేసుకున్న చెప్పుల గురించి మాట్లాడుకుంటున్నారు.
మహేష్ సినిమాల్లో ఉన్నప్పుడు కాకుండా రియల్ లైఫ్ లోనూ ఖరీదైన వస్తువులను వాడుతూ ఉంటారు. అయితే మహేష్ వేసుకున్న చెప్పులు పర్సనలా లేదా సినిమా షూటింగ్ కోసం తెచ్చారా? అనేది తేలాల్సి ఉంది. ఏదిఏమైనా సినిమా షూటింగ్ లోనూ కూడా మహేష్ ఇలా కాస్ల్టీవి వాడటంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మహష్ బాబు ఈ సినిమా తరువాత శంకర్ తో తీసే అవకాశం ఉంది. అటు త్రివిక్రమ్ సైతం బన్నీతో కమిట్మెంట్ అయ్యారు.
ఇక ‘గుంటూరు కారం’ సినిమాలో అజయ్, సునీల్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాలో సునీల్ కచ్చితంగా ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే.సునీల్ ను సినిమాల్లోని తీసుకొచ్చింది త్రివిక్రమ్ అని చెప్పుకుంటారు. సునీల్ వివిధ క్యారెక్టర్ లో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి ‘జైలర్’లో మెరిసిన విషయం అందరికీ తెలిసిందే.