Mani Ratnam and RGV : అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ…ఈయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఆయన నాగార్జునతో చేసిన శివ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడంతో ఆయన ఇండస్ట్రీలో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ఇక ఆ తర్వాత క్షణక్షణం, గోవిందా గోవిందా, రాత్రి లాంటి చాలా సినిమాలు చేసి తనకి తానే పోటీ అనేలా తనని తను ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ లో కూడా చాలా సినిమాలు చేసి సక్సెస్ లు అందుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం కూడా వరుసగా మంచి సినిమాలు చేస్తూ తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని అలరిస్తూ వచ్చాడు. అయితే వీళ్ళిద్దరూ దిగ్గజ దర్శకులుగా అప్పట్లో మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నారు. ఇక ఆర్జీవి, మణిరత్నం ఇద్దరు కలిసి ఒక సినిమా చేశారనే విషయం చాలా మందికి తెలియదు. అయితే వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమానే దొంగ దొంగ… ఈ సినిమాకి ఇద్దరు దర్శకత్వం వహించారు.
ఇక అలాగే ఈ సినిమాలో కొన్ని సీన్స్ మణిరత్నం డైరెక్షన్ చేస్తే, మరికొన్ని సీన్స్ ని రామ్ గోపాల్ వర్మ తీశాడు. ఇలా ఇద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇద్దరు లెజెండరీ డైరెక్టర్లు కలిసి ఒక సినిమా తీయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. వీళ్ళిద్దరి ఇలా కలిసి సినిమా తీయడం తో అప్పట్లో చాలా మంది డైరెక్టర్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మణిరత్నం పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆర్జీవీ మాత్రం తనకు నచ్చిన సినిమాలు చేస్తూ రిలీజ్ చేస్తూ కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటున్నాడు.
ఇక మొత్తానికైతే ఒకప్పుడు వీళ్ళిద్దరూ ఒక పెను సంచలనాన్ని సృష్టించారనే చెప్పాలి… అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఇద్దరు స్టార్ డైరెక్టర్లు ఒక సినిమాకు డైరెక్షన్ చేయడం అనేది జరగలేదు. కాబట్టి సినిమా హిస్టరీలో ఇలాంటి ఘనతను సాధించిన మొట్ట మొదటి దర్శకులుగా కూడా వీళ్ళిద్దరూ నిలవడం విశేషం…