Mega Family Sankranti Celebrations: మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకలు ఎక్కడో తెలుసా… కూతురితో పాటు ఫ్లైట్ ఎక్కిన రామ్ చరణ్

మెగా హీరోలు అంతా ఒక చోట కలిసి చేసే సందడి మామూలుగా ఉండదు. మెగా ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ అని చెప్పాలి. అయితే ఈసారి సంక్రాంతి వేడుకలు బెంగళూరులో చేసుకుంటున్నారు.

Written By: NARESH, Updated On : January 13, 2024 5:39 pm

Mega Family Sankranti Celebrations

Follow us on

Mega Family Sankranti Celebrations: సంక్రాంతి పండగ వచ్చిందంటే మెగా ఫ్యామిలీ మొత్తం ఒక చోట చేరిపోతారు. పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఎక్కువ శాతం చిరంజీవి ఇంటి వద్దకు వచ్చి అక్కడ అంతా కలిసి సందడి చేస్తుంటారు. కానీ ఈసారి పండుగ వేడుకలు కొత్త ప్లేస్ లో చేసుకోబోతున్నారు. మెగా ఫ్యామిలీ పండుగ సెలబ్రేషన్స్ లో అల్లు ఫ్యామిలీ కూడా కలిసిపోతుంటారు. చాలా వరకు అంతా ఒక రోజు ముందే అక్కడికి చేరుకొని సంక్రాంతి పండుగను చాలా స్పెషల్ జరుపుకుంటారు.

మెగా హీరోలు అంతా ఒక చోట కలిసి చేసే సందడి మామూలుగా ఉండదు. మెగా ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ అని చెప్పాలి. అయితే ఈసారి సంక్రాంతి వేడుకలు బెంగళూరులో చేసుకుంటున్నారు. నేడు మెగా హీరో రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. తన భార్య ఉపాసన, కూతురు క్లీంకార తో కలిసి బెంగళూరు వెళ్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. ఉపాసన తన పప్పి ని ఎత్తుకొని కనిపించగా .. రామ్ చరణ్ కూతురిని ఎత్తుకున్నారు.

మరో వైపు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్య ఎయిర్ పోర్ట్ లో మెరిశారు. ఇక వాళ్ళు కూడా బెంగళూరు వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మెగా ఫ్యామిలీ బెంగళూరు వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బెంగళూరులో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకుంటున్నారు అంటే .. అక్కడ చిరంజీవి కి పెద్ద గెస్ట్ హౌస్ ఉంది.

అందుకే ఈసారి మెగా హీరోలు సంక్రాంతి పండుగని బెంగుళూరులో జరుపుకోబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారా లేదా అనేది సందేహంగా మారింది. అదే సమయంలో అల్లు ఫ్యామిలీ వెళ్తుందా అనేది చూడాలి. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న తరుణంలో అక్కడికి వెళ్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.