https://oktelugu.com/

Guntur Kaaram: గుంటూరు కారం మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

ఫేడ్ అవుట్ దశలో ఉన్న పూజా హెగ్డే కెరీర్ కి అరవింద సమేత వీరరాఘవ ఊపిరిపోసింది. త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ అలవైకుంఠపురంలో లో మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్.

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2024 / 06:48 PM IST

    Guntur Kaaram

    Follow us on

    Guntur Kaaram: గుంటూరు కారం భారీ బడ్జెట్ మూవీ. అందులోనూ మహేష్ బాబు హీరో. త్రివిక్రమ్ వంటి మినిమమ్ గ్యారంటీ డైరెక్టర్. ఇలాంటి ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేయాల్సిందే. ఇది దశ మార్చేసే మూవీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ఒక హీరోయిన్ వదులుకుంది. దాంతో శ్రీలీలకు బంపర్ ఛాన్స్ దక్కింది. గుంటూరు కారం మూవీని వదులుకున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు పూజా హెగ్డే. దర్శకుడు త్రివిక్రమ్ కి పూజ హెగ్డే ఫేవరేట్ హీరోయిన్. ఆమె ప్లాప్స్ లో ఉన్నప్పుడు పిలిచి మరీ అరవింద సమేత వంటి గోల్డెన్ ఆఫర్ ఇచ్చాడు.

    ఫేడ్ అవుట్ దశలో ఉన్న పూజా హెగ్డే కెరీర్ కి అరవింద సమేత వీరరాఘవ ఊపిరిపోసింది. త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ అలవైకుంఠపురంలో లో మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. ముచ్చటగా మూడోసారి కూడా పూజా హెగ్డేనే ఎంపిక చేశాడు. ఏమైందో తెలియదు కొంత షూటింగ్ జరిగాక పూజా హెగ్డే ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీనిపై పూజా హెగ్డే ఎప్పుడూ మాట్లాడలేదు. ఒకసారి సూర్యదేవర నాగవంశీ మాత్రం… డేట్స్ అడ్జస్ట్ కాకనే తప్పుకున్నారని అన్నారు.

    నిజానికి పూజా హెగ్డే చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ లేవు. నాగవంశీ చెప్పిన దాంట్లో నిజం ఉన్నట్లు లేదు. సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్ ని చేశారు. పూజా హెగ్డేను డిమోట్ చేసి సెకండ్ హీరోయిన్ గా మార్చారు. అందుకే పూజా హెగ్డే తప్పుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఏది ఏమైనా ఒక క్రేజీ ప్రాజెక్ట్ పూజా హెగ్డే చేజారింది.

    శ్రీలీలకు ఇది మంచి అవకాశం. ఈ మధ్య కాలంలో శ్రీలీల నటించిన ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. భగవంత్ కేసరి మాత్రమే బ్రేక్ ఈవెన్ దాటి బయటపడింది. కాబట్టి ఒక భారీ హిట్ ఆమెకు అవసరం. గుంటూరు కారం విజయం సాధిస్తే… ఆమె క్యాలెండర్ ఆఫర్స్ తో నిండిపోవడం ఖాయం. గుంటూరు కారం జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.