https://oktelugu.com/

Shanmukh Jaswanth : కోట్లకు పడగలెత్తిన ఓ సామాన్య యూట్యూబర్… షణ్ముఖ్ సంపాదన ఎంతో తెలుసా!

షణ్ముఖ్ నష్ట పోకూడదని దీప్తి సునయన అతడు బయటకు వచ్చాక బ్రేకప్ ప్రకటించింది. వీరిద్దరూ కలిసి అనేక సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేశారు. 2021 నుండి వీరు విడివిడిగా ఉంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 3, 2023 / 08:35 PM IST
    Follow us on

    Shanmukh Jaswanth : సోషల్ మీడియా విప్లవంలో ఎవరైనా సెలబ్రిటీ కావచ్చు. తమ టాలెంట్ నిరూపించి లక్షలు సంపాదించవచ్చు. అలా వెలుగులోకి వచ్చినవాళ్లు ఎందరో ఉన్నారు. షణ్ముఖ్ జస్వంత్ కూడా అలాంటి వాడే. షణ్ముఖ్ కి నటన, డాన్స్ అంటే ఇష్టం. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్, సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అతడు నటించిన కొన్ని వెబ్ సిరీస్లు భారీ విజయం సాధించాయి. ముఖ్యంగా ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ సిరీస్ సూపర్ హిట్ కాగా, షణ్ముఖ్ సోషల్ మీడియా స్టార్ అయ్యాడు.

    ఇక బిగ్ బాస్ షో అతని ఇమేజ్ మరింత పెంచింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా షణ్ముఖ్ ఫైనల్ కి వెళ్ళాడు. తృటిలో టైటిల్ చేజార్చుకున్నాడు. వీజే సన్నీ, షణ్ముఖ్ టైటిల్ రేసులో నిలిచారు. వీజే సన్నీ విన్నర్ కాగా షణ్ముఖ్ రన్నర్ అయ్యాడు. అయితే రెమ్యూనరేషన్ రూపంలో భారీగా ఆర్జించాడు. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా షణ్ముఖ్ తో ఓ వెబ్ సిరీస్ చేసింది. ఇక యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లో డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు.

    షణ్ముఖ్ సంపాదన కోట్లకు చేరిందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అతడికి వివిధ మార్గాల ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. అలాగే ఇన్ఫినిటీ మీడియం వారు నెలకు రూ. 5 లక్షలు రూపాయలు ఇస్తున్నారట. ఒక అంచనా ప్రకారం షణ్ముఖ్ ఆస్తి విలువ రూ. 20 కోట్లకు పైనే ఉంటుందట. ఇటీవల ఓ ఖరీదైన లగ్జరీ కారును కొన్నాడు.

    కాగా షణ్ముఖ్ తన లవర్ దీప్తి సునయనతో విడిపోయాడు. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరి హన్మంత్ తో రొమాన్స్ చేశాడు. వీరిద్దరూ హౌస్లో హద్దులు మీరు ప్రవర్తించారు. షణ్ముఖ్-సిరి ఎఫైర్ చర్చకు దారి తీసింది. షణ్ముఖ్ నష్ట పోకూడదని దీప్తి సునయన అతడు బయటకు వచ్చాక బ్రేకప్ ప్రకటించింది. వీరిద్దరూ కలిసి అనేక సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేశారు. 2021 నుండి వీరు విడివిడిగా ఉంటున్నారు.