Jabardasth Rocking Rakesh: ఈటీవీ లో ప్రసారమయ్యే బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ సుమారుగా పదేళ్ల నుండి విరామం లేకుండా కొనసాగుతున్న సంగతి తెలిసిందే, ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు, వారిలో కొంతమంది ఇంకా వెండితెర మీద క్లిక్ అవ్వలేదు కానీ బుల్లితెర ఆడియన్స్ ని మాత్రం బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాడు.
అయితే ఈయన ఒకప్పటి యాంకర్ మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ జోర్డాన్ సుజాత ని ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన వీళ్లిద్దరి స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారింది.ఒకరి కష్టాలను ఒకరు పంచుకుంటూ మరింత దగ్గరయ్యారు. బుల్లితెర పై మోస్ట్ బ్యూటిఫుల్ జంట గా మంచి పేరు తెచ్చుకున్నారు. సుజాత కూడా ప్రస్తుతం రాకేష్ తో కలిసి జబర్దస్త్ షో లో ఒక కమెడియన్ గా కొనసాగుతుంది.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా సుజాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రాకేష్ గురించి సుజాత మాట్లాడిన కొన్ని మాటలు చూస్తూ ఉంటే, అతనిపై ఆమెకి ఎంత ప్రేమ ఉందొ అర్థం అవుతుంది, సుజాత మాట్లాడుతూ ‘రాకేష్ కెరీర్ ప్రారంభం లో ఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి వచ్చాడు. జబర్దస్త్ లో టీం లీడర్ స్థాయికి ఎదగడం అంటే సాధారణమైన విషయం కాదు, టాలెంట్ తో పాటు ఎంతో కష్టపడాలి కూడా.రాకేష్ లో ఆ రెండు ఉన్నాయి, అందుకే ఈ స్థానం లో ఉన్నాడు.మనిషి కూడా ఎంతో మంచోడు, అలాంటోడు నా భర్త గా వచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నాను. పెళ్లి చూపులప్పుడు మా అమ్మ కట్నం ఎంత కావలి బాబు అని అడిగితే, మీ అమ్మాయిని ఇస్తున్నారు గా అది చాలు అని అన్నాడు’ అంటూ రాకేష్ గురించి ఎంతో ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది సుజాత.