Bigg Boss 6 Telugu: భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీసన్ 6 ఊహించని మలుపులతో ముందుకు దూసుకెళ్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..ఈ వారం టాస్కులు ఎంత అద్భుతంగా సాగిందో మన అందరికి తెలిసిందే..అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏంటి అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందట..సీసన్ ప్రారంభం లో మొదటి వారం అసలు ఎలిమినేషన్ ని లేకుండా చేసిన బిగ్ బాస్ ఆ తర్వాత రెండవ వారం లో డబుల్ ఎలిమినేషన్ పెట్టాడు.

ఇప్పుడు మరోసారి డబుల్ ఎలిమినేషన్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది..ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి శ్రీహాన్, శ్రీ సత్య, గీతూ, ఆది రెడ్డి, కీర్తి, రాజ్ కుమార్, సుదీప , మెరీనా మరియు బాలాదిత్య నామినేట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే..వీరిలో ఇద్దరినీ ఈ వారం ఎలిమినేట్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది..కానీ ఎలిమినేట్ అయినా ఇద్దరిలో ఒకరిని సీక్రెట్ రూమ్ లోకి పంపి, కొద్దీ రోజుల తర్వాత హౌస్ లోకి పంపబోతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది.
అయితే ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న ఆ ఇద్దరి ఇంటి సభ్యులు ఎవరు..ఏ కంటెస్టెంట్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది పరిశీలిస్తే..సోషల్ మీడియా లో తరచు జరుగుతున్నా పొలింగ్స్ లో వచ్చే వోట్లని ఆధారంగా తీసుకొని చూస్తే ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్న ఇంటి సభ్యులు బాలాదిత్య, సుదీప మరియు రాజ్ శేఖర్..డబుల్ ఎలిమినేషన్ కానీ పెడితే వీళ్ళ ముగ్గురిలో బాలాదిత్య మరియు రాజ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ..ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని సీక్రెట్ రూమ్ లోకి పంపాలి అనుకుంటే బాలాదిత్య ని సీక్రెట్ రూమ్ లోకి పంపే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది.

మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి..ఇక ఈ వారం నామినేట్ అయినా ఇంటి సభ్యులలో అందరికంటే అత్యధిక ఓట్లతో శ్రీహన్ మొదటి స్థానం లో కొనసాగుతుంది..ఇక ఆయన తర్వాత ఆది రెడ్డి, గీతూ మరియు మెరీనా రెండు , మూడు మరియు నాల్గవ స్థానాల్లో ఉన్నట్టు తెలుస్తుంది.