https://oktelugu.com/

Mangalavaaram Movie: మంగళవారం సినిమాలోని జమీందారు భార్య పాత్రలో చేసిన హీరోయిన్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

అయితే ఈ సినిమా వల్ల పాయల్ రేంజ్ ఎలా పెరిగిందో.. మరో హీరోయిన్ పేరు కూడా అదే రేంజ్ లో దూసుకొని పోతుంది. ఈ సినిమాలో జమీందారు భార్య పాత్రలో నటించిన అమ్మాయి చూడడానికి అందంగా పాయల్ రాజ్ పుత్ కి మంచి పోటీ ఇచ్చింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 20, 2023 / 04:06 PM IST
    Follow us on

    Mangalavaaram Movie: రీసెంట్ గా వచ్చి కలెక్షన్లను కొల్లగొడుతున్న సినిమా మంగళవారం. పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సంపాదించింది. అంతే కాదు ఇప్పటికీ ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకొని పోతుంది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సంపాదించింది. ఇక థియేటర్లలో మంగళవారం సినిమాను చూడడానికి జనాలు పోటెత్తారు. అజయ్ భూపతి పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా వారికి మరో హిట్ ను అందించింది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు.. అదే రేంజ్ లో ఇప్పుడు మంగళవారం సినిమా కూడా హిట్ ను సొంతం చేసుకుంది.

    అయితే ఈ సినిమా వల్ల పాయల్ రేంజ్ ఎలా పెరిగిందో.. మరో హీరోయిన్ పేరు కూడా అదే రేంజ్ లో దూసుకొని పోతుంది. ఈ సినిమాలో జమీందారు భార్య పాత్రలో నటించిన అమ్మాయి చూడడానికి అందంగా పాయల్ రాజ్ పుత్ కి మంచి పోటీ ఇచ్చింది. మరి ఈమె ఎవరు అనే సెర్చింగ్ సోషల్ మీడియాలో తెగ సాగుతుంది. జమీందారు భార్య పాత్రలో మెరిసిన ఈ అమ్మడు పేరు దివ్వ పిళ్లై. ఈమె కూడా హీరోయినే. అయితే తెలుగులో కాదు మలయాళంలో నటించి మంచి పేరు సంపాదించింది.

    మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న దివ్య పిల్లై నటన టాలెంట్ ను గుర్తించిన అజయ్ భూపతి మంగళవారం సినిమాలో ఆమెకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో అవకాశం ఇచ్చారు. అయితే ఈ పాత్ర మొదట్లో పెద్దగా ఇంపార్టెంట్ అనిపించికపోయినా చివర్లో మాత్రం ట్విస్ట్ తో షాక్ కు గురి చేస్తుంది. ఇలా ఈ అమ్మడుకు కూడా మంగళవారం సినిమా బాగా కలిసివచ్చినట్టుగా అయింది. దీంతో అమ్మడుకు చాలా అవకాశాలు వస్తున్నాయట. అంతే కాదు ఈమెను దర్శకనిర్మాతలు సంప్రదిస్తున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది.