Allu Arjun Badrinath: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి వరల్డ్ వైడ్ ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తన డాన్స్ మరియు యాక్టింగ్ టాలెంట్ తో సోషల్ మీడియా వృద్ధిలోకి వచ్చినప్పటి నుండి ఆయన రీచ్ ఖండాలను ఎప్పుడో దాటేసింది..ఇక పుష్ప సినిమా తో ఆయన ఏ రేంజ్ కి వెళ్లిపోయాడో మన అందరికి తెలిసిందే..ఇదంతా పక్కన పెడితే మన శత్రుదేశం పాకిస్థాన్ లో కూడా ఇండియన్ సినిమాలు కొన్ని అద్భుతమైన వసూళ్లను రాబట్టి సూపర్ హిట్స్ గా నిలిచినవి ఉన్నాయి..బాలీవుడ్ మూవీస్ కి అక్కడ ఎప్పటి నుండో మంచి మార్కెట్ ఉంది.

కానీ బాలీవుడ్ మూవీస్ మాత్రమే కాదు..టాలీవుడ్ నుండి బాహుబలి సిరీస్ కి కూడా అక్కడ దుమ్ములేపే వసూళ్లు వచ్చాయి..బాహుబలి 2 చిత్రం అక్కడ దాదాపుగా 5 కోట్ల 50 లక్షల రూపాయిలు వసూలు చేసింది..కానీ బాహుబలి సినిమా మాత్రమే కాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా పాకిస్తాన్ బాహుబలి రేంజ్ వసూళ్లు సాధించింది అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఇక అసలు విషయానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు వీవీ వినాయక్ కాంబినేషన్ లో 2011 వ సంవత్సరం లో విడుదలైన బద్రీనాథ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లో పెద్ద ఫ్లాప్ గా నిలిచింది..భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సుమారుగా 30 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది..ఈ సినిమాని కొన్నేళ్ల క్రితం హిందీ లో దబ్ చేసి విడుదల చేసారు..అలా పాకిస్తాన్ లో కూడా ఈ చిత్రం విడుదలైంది అట..అక్కడ ఈ సినిమా ఎవ్వరు ఊహించని విధంగా 4 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి సంచలనం సృష్టించినట్టు తెలుస్తుంది..తెలుగు నుండి హిందీ లో దబ్ అయినా సినిమాలకు యూట్యూబ్ లో వందల మిలియన్ వ్యూస్ రావడం మనం చూస్తూనే ఉంటాము.

ఈ వ్యూస్ అధిక శాతం బంగ్లాదేశ్ మరియు పాకిస్థాన్ నుండి కూడా వస్తూ ఉంటాయట..మన తెలుగు కమర్షియల్ మూవీస్ కి అక్కడ ఉండే డిమాండ్ వేరట..ఫ్లాప్ సినిమాలకు సైతం అద్భుతమైన వ్యూస్ యూట్యూబ్ లో రావడం మనం గమనిస్తూనే ఉన్నాము..ముఖ్యం గా అల్లు అర్జున్ , రామ్ చరణ్ సినిమాలకు పాకిస్థాన్ లో కూడా మంచి డిమాండ్ ఉంటుందట..అలా బద్రీనాథ్ సినిమా విడుదలై పాకిస్తాన్ లో కూడా దుమ్ము లేపేసిందట.