Anasuya Bharadwaj: అమెరికాలో అనసూయ రోజుకో రాష్ట్రంలో తిరుగుతుంది. మొన్న టెక్సాస్, నిన్న డల్లాస్ నేడు న్యూ జెర్సీలో విహారం చేస్తుంది. లాంగ్ బ్రేక్ రావడంతో అనసూయ అమెరికాలో వెకేషన్ ప్లాన్ చేసినట్లున్నారు. సంపాదనతో పాటు సరదాలు తీర్చుకుంటూ అక్కడ ఆహ్లాదంగా గడుపుతున్నారు. అనసూయ షేర్ చేస్తున్న ఫొటోలే ఇందుకు నిదర్శనం. తన అభిమానులు మెచ్చుకోవాలని శత్రులు నొచ్చుకోవాలని అనసూయ ప్రతి అప్డేట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు. అమెరికాలో తింటున్న తిండి, కడుతున్న బట్ట, సందర్శిస్తున్న ప్రదేశాల గురించి క్షుణ్ణంగా తెలియజేస్తున్నారు.

అనసూయ అమెరికా వెళ్లి వారం రోజులు అవుతుంది. తిరుగు ప్రయాణం ఎప్పుడో తెలియదు కానీ అక్కడ దున్నేస్తున్నారు. అనసూయ యాంకరింగ్ కి పూర్తిగా సెలవిచ్చింది. దాదాపు పదేళ్లు జబర్దస్త్ యాంకర్ గా అనసూయ పనిచేశారు. ఆ షో ఆమె ఫేట్ మార్చేసింది. జీవితానికి సరిపడా సెటిల్మెంట్ ఆ షో వలన అనసూయకు దక్కింది. స్టార్ యాంకరైనా, నటిగా అవకాశాలు వస్తున్నా జబర్దస్త్ పుణ్యమే. ఇటీవల అనసూయ జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చేశారు.
జబర్దస్త్ వదిలేసిన అనసూయ విమర్శలు చేయడం విశేషం. అనేక సందర్భాల్లో కమెడియన్స్ బాడీ షేమింగ్ కి గురి చేశారని అనసూయ వాపోయింది. నా శరీరంపై జోక్స్ వేసినప్పుడు మనసుకు బాధేసేది. నేను రియాక్ట్ అయినా ఎడిటింగ్ లో తీసేసే వారని అనసూయ చెప్పుకొచ్చారు. రెండేళ్ల క్రితమే జబర్దస్త్ మానేయాలని డిసైడ్ అయ్యానని చెప్పిన అనసూయ… కాంట్రాక్ట్ ముగియడంతో బయటకు వచ్చేసినట్లు వెల్లడించారు. నటిగా అనసూయ బిజీ అయ్యారు. అందుకే తక్కువ డబ్బులొచ్చే యాంకరింగ్ వదిలేశారు.

అనసూయ లేటెస్ట్ మూవీ అరి. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన అరి విడుదలకు సిద్దమవుతుంది. ఈ మూవీకి నెట్ఫ్లిక్స్ రూ. 10 కోట్ల భారీ డీల్ ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అరి మూవీ నేరుగా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం కలదు అంటున్నారు. కాగా అనసూయ పుష్ప 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. ఇక కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రంగమార్తాండ చిత్రం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ మూవీలో అనసూయ దేవదాసీ రోల్ చేస్తున్నట్లు సమాచారం.