Anasuya Bharadwaj Son: అనసూయ యంగ్ అండ్ స్లిమ్ లుక్ మైంటైన్ చేస్తుంది. ఆమె ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మడం కష్టమే. ఇక అనసూయ పెద్ద కొడుకు వయసు తెలిస్తే మన మైండ్ బ్లాక్ అవుతుంది. అనసూయ ప్రస్తుత వయసు 38. ముప్పై ఏళ్ల లోపే ఆమె వివాహం చేసుకున్నారు. అనసూయది ప్రేమ వివాహం. సుశాంక్ భరద్వాజ్ ని ఆమె ఎన్ సి సి క్యాంపులో కలిశారు. అలా ఏళ్ల తరబడి ప్రయాణం సాగింది. ప్రేమకు దారి తీసింది. అనసూయ తండ్రి వీరి ప్రేమను అంగీకరించలేదు. దాంతో ఇంట్లో నుండి బయటకు వచ్చేసింది. అయితే పెళ్లి చేసుకోలేదు.
తర్వాత కొన్నాళ్లకు పేరెంట్స్ ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. అనసూయకు ఇద్దరు అబ్బాయి. ఇటీవల పెద్దబ్బాయి పుట్టినరోజు చేసుకున్నారు. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఇష్టమైన ప్రదేశానికి వెళ్లారు. అనసూయ ఫ్యామిలీ వెకేషన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా తన పెద్ద కొడుకు వయసు ఎంతో అనసూయ రివీల్ చేసింది.
కాలం కనురెప్ప పాటులో గడచి పోతుంది. మా అబ్బాయి అప్పుడే టీనేజ్ కి వచ్చేశాడంటే నమ్మలేకపోతున్నాను అని కామెంట్ చేసింది. టీనేజ్ 13 ఏళ్లకు స్టార్ట్ అవుతుంది. అనసూయకు అంత వయసుకున్న కొడుకు ఉన్నాడా! అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. యాంటీ ఫ్యాన్స్ అందుకే నిన్ను ఆంటీ అంటుందని ఎద్దేవా చేస్తున్నారు. అభిమానులు మాత్రం ఆ వయసు పిల్లలున్నా మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇక అనసూయ యాంకరింగ్ వదిలేసిన విషయం తెలిసిందే. నటిగా ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో వెండితెరకు పరిమితమయ్యారు. యాంకరింగ్ మానేశాక అనసూయ బుల్లితెర షోల మీద ఆరోపణలు చేయడం విశేషం. జబర్దస్త్ కమెడియన్స్ బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని సంచలన కామెంట్స్ చేశారు. అనసూయ ఇటీవల రంగమార్తాండ చిత్రంలో కీలక రోల్ చేశారు. ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.