https://oktelugu.com/

Shankar Dada MBBS: శంకర్ దాదా సినిమాలో శ్రీకాంత్ తన పాత్ర ని వదులుకుంటే డబ్బులు ఇస్తాను అని చెప్పిన నటుడు ఎవరో తెలుసా..?

శ్రీకాంత్, చిరంజీవి పర్సనల్ గా ఒక పని మీద కలుసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసుకుంటూ చిరంజీవి శ్రీకాంత్ తో ఎటిఎం క్యారెక్టర్ నువ్వు చేసేయి అని చెప్పాడంట.

Written By:
  • Gopi
  • , Updated On : January 23, 2024 / 02:31 PM IST

    Shankar Dada MBBS

    Follow us on

    Shankar Dada MBBS: బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని చిరంజీవి రీమేక్ రైట్స్ ని తీసుకున్నాడు. అయితే తెలుగు నేటి వీటికి తగ్గట్టుగా పరుచూరి బ్రదర్స్ ఆ సినిమా స్టోరీని మార్పులు చేర్పులు చేస్తూ చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా సెట్ చేశారు. అయినప్పటికీ చిరంజీవి పక్కన ఏటీఎం క్యారెక్టర్ ని చేయడానికి ఎవరిని తీసుకోవాలి అనేది అర్థం కాక దాదాపు రెండు నెలలుగా ఆ ఒక్క క్యారెక్టర్ కోసమే రకరకాల వ్యక్తులను అనుకొని వారిని తీసేస్తూ వస్తున్నారు.

    ఇక ఇలాంటి క్రమం లోనే ఏటీఎం క్యారెక్టర్ కోసం చాలామందిని చిరంజీవి చూస్తు వస్తున్నాడు. ఇక శ్రీకాంత్ కూడా వాళ్లందర్నీ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఆ క్యారెక్టర్ తనకైతే బాగుంటుందని శ్రీకాంత్ తనలో తాను అనుకుంటున్నప్పటికీ తను చేస్తానని చిరంజీవితో చెప్తే తనని వద్దనుడు శ్రీకాంత్ అడిగాడు కాబట్టి ఆ పాత్రకు సెట్ అవ్వకపోయిన చిరంజీవి తనని తీసుకుంటాడు,అలా తీసుకున్నాక ఒక వేళ తను ఆ పాత్ర కి సెట్ అవ్వకపోతే సినిమాకి తనవల్ల ఏమైనా ఇబ్బంది జరగొచ్చు అనుకున్నాడట, ఇక అలాగే ఒకవేళ నేనే అ క్యారెక్టర్ కి సెట్ అవుతాను అనుకుంటే అన్నయ్య నన్ను చేయమని అడుగుతాడు కదా అలాంటప్పుడు మనం అన్నయ్యని అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని తన కోరికని మనసులో పెట్టుకొని శ్రీకాంత్ చిరంజీవికి చెప్పకుండా కామ్ గా ఉండేవాడట…

    అయితే ఒక రోజు శ్రీకాంత్, చిరంజీవి పర్సనల్ గా ఒక పని మీద కలుసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసుకుంటూ చిరంజీవి శ్రీకాంత్ తో ఎటిఎం క్యారెక్టర్ నువ్వు చేసేయి అని చెప్పాడంట. దాంతో శ్రీకాంత్ ఒకసారి షాక్ అయ్యాడట, అది చూసి చిరంజీవి నీకు చేయడం ఇష్టం లేదా శ్రీకాంత్ అని అడిగితే అలా కాదు అన్నయ్య మీరు ఎప్పుడు అడుగుతారని వెయిట్ చేస్తున్నాను అని చెప్పి ఆ క్యారెక్టర్ చేయడానికి శ్రీకాంత్ రెడీ అయిపోయాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా క్యారెక్టర్ నుంచి తప్పుకోమని శ్రీకాంత్ కి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద నటుడు ఫోన్ చేసి చెప్పాడట ఈ విషయాన్ని శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

    ఆయన ఎవరు అనేది బయటికి చెప్పనప్పటికీ ఆ నటుడు తనని తప్పుకోమని అన్న విషయాన్ని అయితే చెప్పాడు. ఆ క్యారెక్టర్ నుంచి నేను తప్పుకుంటే ఆ వ్యక్తి ఆ క్యారెక్టర్ చేస్తాడట అని శ్రీకాంత్ చెప్పాడు. అలాగే ఆయనకి కౌంటర్ గా నేను తప్పుకుంటే నీకు క్యారెక్టర్ రావడం ఏంటి నువ్వు ఆ క్యారెక్టర్ కి సెట్ అయితే వాళ్లే నిన్ను పిలుస్తారు కదా అని అతనికి చెప్పి అతని నుంచి శ్రీకాంత్ తప్పించుకున్నడట ఈ విషయాన్ని శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు…