Jailer Rajinikanth Son: చాలాకాలం తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కి జైలర్ సినిమాతో ఒక మంచి సూపర్ హిట్ లభించింది. డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక విడుదల అయ్యాక కూడా సినిమా అంచనాల కంటే ఎక్కువగానే కలెక్షన్ల ను నమోదు చేసుకుంటుంది. సినిమా నుంచి తమన్నా డాన్స్ చేసిన “కావాలి” పాట కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
అయితే ఈ సినిమాలో రజనీకాంత్ కొడుకు పాత్రలో నటించిన నటుడి గురించి కేవలం కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ నటుడు వసంత్ రవి. రెండు రకాల షేడ్లు ఉన్న పాత్రలో వసంత్ రవి చాలా బాగా నటించాడు. చెన్నైలో బాగా పాపులర్ అయిన నమ్మ వీడు వసంత భవన్ రెస్టారెంట్స్ చైన్ కి చైర్మన్ కొడుకు వసంత్ రవి. మొదటగా “తారామణి” అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు వసంత్ రవి. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు.
ఆ తరువాత రాకీ మరియు అస్విన్స్ సినిమాల్లో నటించిన వసంత్ తాజాగా ఇప్పుడు జైలర్ సినిమాలో రజనీకాంత్ కొడుకు పాత్రలో కనిపించారు. సినిమాలో ఏసిపి అర్జున్ పాత్రలో కనిపించారు వసంత్. క్లైమాక్స్ లో తన పాత్రకి మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది. తన పాత్రలో బాగా ఒదిగిపోయి వసంత్ రవి చాలా బాగా నటించారు.
రమ్య కృష్ణ, మిర్నా మీనన్, వినాయకన్, యోగి బాబు కీలక పాత్రలలో కనిపించిన ఈ సినిమాలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, తమన్నా, శివ రాజ్ కుమార్ క్యామియో పాత్రలలో కనిపించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళా నిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. మంచి అంచనాల మధ్య ఆగస్టు 10వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లను అందుకుంటుంది.