Do you know the actor who encouraged Rajinikanth to do a robo film
Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ లాంటి నటుడు చాలా అరుదుగా కనిపిస్తాడు. నిజానికి ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎక్కడి నుంచి వచ్చాడు ఎంత ఎత్తుకు ఎదిగాడు అనే విషయం పక్కన పెడితే ఆయన ఇప్పటికీ కూడా తన మూలాలను మాత్రం మర్చిపోడు. అందువల్లే ఆయన సూపర్ స్టార్ గా ఇన్ని సంవత్సరాలపాటు ప్రేక్షకులకు గుర్తుండి పోతున్నాడు. ఇక ప్రతి ఒక్కరూ కూడా మనం ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగినట్టు ఉంటేనే ఇక్కడ మరింత పైకి ఎదుగుతాం అనేది తెలుసుకుంటే మంచిది.
ఇక రజనీకాంత్ ను చూసి చాలా మంది హీరోలు గాని, దర్శకులు గాని నేర్చుకుంటే బాగుంటుంది అని సినీ మేధావులు వాళ్ల అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ హీరోగా వచ్చిన రోబో సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక అప్పట్లోనే ఈ సినిమా దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి పాన్ ఇండియాలో ఒక సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిచింది.
Also Read: Shankar Bharateeyudu 2: శంకర్ భారతీయుడు 2 కోసం అనిరుధ్ ను తీసుకొని తప్పు చేశాడా..?
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని మొదట శంకర్ కమలహాసన్ తో చేయాలనుకున్నాడట. కానీ కమలహాసన్ అప్పటికే ‘దశావతారం ‘ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్టు చేయడం వీలు కాలేదు. ఇక దాంతో కమలహాసన్ దీనికి రజనీకాంత్ అయితే చాలా బాగా సెట్ అవుతాడని రజనీకాంత్ దగ్గరకు వెళ్లి శంకర్ తో పాటు అతనికి కథ చెప్పి ఒప్పించారట.
Also Read: Kalki 2898 AD USA Review: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ మూవీ యూఎస్ఏ రివ్యూ…
ఇక ఈ సినిమాని శంకర్ రజనీకాంత్ స్టైల్ కి మార్చి చేశాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా అప్పట్లో రజినీకాంత్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇక దీనికంతటికీ కారణం కమలహాసన్ అని రజనీకాంత్ చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇక మొత్తానికైతే వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చాలా గొప్పదని ఆ సందర్భం లో కమల్ హాసన్ ఈ సంఘటన ద్వారా మరోసారి నిరూపించాడు…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Do you know the actor who encouraged rajinikanth to do a robo movie