Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ సినిమా వచ్చే నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ నుండి సినిమా వచ్చి ఏడాదికి పైగా సమయం దాటింది.
ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని నిన్ననే విడుదల చేసారు, దీనికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదల చేసిన అతి తక్కువ సమయం లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల కొద్దీ లైక్స్ ని సొంతం చేసుకుంది. వింటేజ్ పవర్ స్టార్ ని చూసిన ఆనందం లో అభిమానులు పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. ఇక సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే ఇంతకు మించి కావాల్సింది ఏముంది అని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకి వచ్చింది.
అదేమిటంటే ఈ చిత్రం తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మనకి తెలియని విషయం ఏమిటంటే, ఈ సినిమాని రీమేక్ రైట్స్ కోసం ముందుగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ప్రయత్నం చేసాడట. ఈ సినిమాని వెంకటేష్ మరియు రానా కాంబినేషన్ లో తియ్యాలని ఆయన ప్లాన్. అందుకోసం నేరుగా ఆ చిత్ర డైరెక్టర్ సముద్ర ఖని ని సంప్రదించగా, ఆయన కూడా ఓకే చెప్పాడు. అయితే మరో రెండు రోజుల తర్వాత త్రివిక్రమ్ కూడా ఈ సినిమాని చూసి, ఇది మనం పవన్ కళ్యాణ్ తో తీస్తే ఎలా ఉంటుంది అన్నాడట.
అద్భుతంగా ఉంటుంది సార్, కానీ ఇలా సురేష్ బాబు గారు కూడా ఈ సినిమా కోసం అడిగారు అని చెప్పగా, ఆయనతో నేను మాట్లాడుతాను అని చెప్పి, సురేష్ బాబు ని రిక్వెస్ట్ చేసుకొని, ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచన నుండి తప్పించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అలా ఈ సినిమా వెంకటేష్ – రానా చేతుల్లో నుండి పవన్ కళ్యాణ్ మరియు సై ధరమ్ తేజ్ చేతుల్లోకి వెళ్ళింది.