Rajanna Movie: రాజన్న సినిమాలో ఆ సీన్స్ ను రాజమౌళి తీశాడనే విషయం మీకు తెలుసా..?

మగధీర సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ సక్సెస్ అయిన తర్వాత తెలంగాణ హిస్టరీ కి సంబంధించిన ఒక ఫిక్షన్ స్టోరీని రాసుకొని దాన్ని రాజన్న పేరుతో తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశాడు.

Written By: Gopi, Updated On : March 20, 2024 1:00 pm

Rajamouli shot that scene in Rajanna Movie

Follow us on

Rajanna Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రైటర్ విజయేంద్రప్రసాద్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా రాజమౌళి(Rajamouli) చేసే ప్రతి సినిమాకి ఆయనే రైటర్ గా వ్యవహరిస్తాడు ఇక ఆయన డైరెక్టర్ గా మారి కొన్ని సినిమాలు చేశారన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ఆయన 2005 వ సంవత్సరంలో శ్రీకాంత్, వేణు లను హీరోలుగా పెట్టుకొని ‘శ్రీకృష్ణ 2005 ‘ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు.

కానీ యావరేజ్ గా ఆడింది. ఇక దాంతో ఆయన మరోసారి సినిమా చేయడానికి ప్రయత్నం చేయలేదు. కానీ మగధీర సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ సక్సెస్ అయిన తర్వాత తెలంగాణ హిస్టరీ కి సంబంధించిన ఒక ఫిక్షన్ స్టోరీని రాసుకొని దాన్ని రాజన్న పేరుతో తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఈ సినిమాలు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ను రాజమౌళి తెరకెక్కించాడట. అలాగే నాగార్జున ఉన్న కొన్ని సీన్స్ ను కూడా ఆయన తీశాడనే విషయం కూడా మనలో చాలా మందికి తెలీదు…

అయితే ఈ సినిమాను చేసినందుకుగాను విజయేంద్రప్రసాద్ గారికి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అయితే వచ్చాయి అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ అయితే సాధించలేదు. ఇక దాంతో ఆయన డైరెక్టర్ గా పెద్దగా సక్సెస్ సాధించలేదు. అయినప్పటికీ రాజమౌళి చేసే సినిమాలకు కథలను అందిస్తూ రైటర్ గా మాత్రం పాన్ ఇండియాలో తన సత్తాను చాటుతున్నాడు. ఇక వరుసగా బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో తన సత్తాను చాటుకున్న విజయేంద్రప్రసాద్ ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే సినిమాకి కథని సిద్ధం చేశాడు.

ఇక ఈ సినిమాతో వరల్డ్ లోనే ది బెస్ట్ రైటర్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే రాజమౌళి డైరెక్టర్ గా వాళ్ళ నాన్న రచయితగా వరల్డ్ సినిమా స్థాయిలో వాళ్ళ పేర్లను చిరస్మరణీయంగా నిలుపుకోబోతున్నారనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది…