Mohan Babu On Rajinikanth: రజినీకాంత్ కి మోహన్ బాబు కి మధ్య ఇండస్ట్రీలో మంచి స్నేహబంధం ఉందనే విషయం చాలామందికి తెలియదు. వాళ్లిద్దరూ సినీ కెరీయర్ ని ఒకేసారి స్టార్ట్ చేసినప్పటికీ మొదట్లో వాళ్ళిద్దరికీ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చాయి. అయితే రజనీకాంత్ ముందు విలన్ గా నటించినప్పటికీ ఆ తర్వాత హీరోగా చేస్తూ మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇక మోహన్ బాబు మాత్రం విలన్ గా, కామెడీ విలన్ గా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ అనేది ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఆ తర్వాత తను హీరోగా కొన్ని సినిమాలు చేశాడు అయిన కూడా స్టార్ హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు. మోహన్ బాబు హీరో గా ఎదగడానికి రజినీకాంత్ చాలా వరకు హెల్ప్ చేశారనే చెప్పాలి. ముఖ్యంగా మోహన్ బాబు హీరోగా మారిన క్రమంలో వరుసగా అన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చాయి.
ఇక ఇలాంటి క్రమంలో మోహన్ బాబుని పిలిపించి తమిళంలో హిట్ అయిన ఒక సినిమాని చూపించి దీన్ని పెదరాయుడు అనే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేయమని చెప్పాడు. దాంతో మోహన్ బాబు తెలుగులో ఈ సినిమాని రీమేక్ చేశాడు.
అలాగే ఈ సినిమాలో మోహన్ బాబు తండ్రి పాత్రలో రజినీకాంత్ నటించి ఆ సినిమాకి మంచి బుస్టాప్ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆ ఇయర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక మోహన్ బాబు స్టార్ హీరో అవ్వడానికి ఈ సినిమా చాలావరకు హెల్ప్ చేసింది అయినప్పటికీ ఆ తర్వాత మోహన్ బాబుకి మళ్ళీ వరుస ఫెయిల్యూర్స్ రావడంతో ఆయన ఎక్కువ కాలం పాటు హీరో గా నిలవలేకపోయారు. అయినప్పటికీ మోహన్ బాబుని స్టార్ హీరోని చేయడానికి మాత్రం రజనీకాంత్ చాలా రకాలుగా కష్టపడ్డారనే చెప్పాలి…
ఇక వీళ్లిద్దరూ ఇప్పటికి కూడా చాలా మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. ఇక రజినీకాంత్ ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నప్పటికి మోహన్ బాబు మాత్రం సినిమాలు ఏమి లేక ఖాళీ గానే ఉంటున్నారు…