Vakeel Saab Director: సినిమా ఇండస్ట్రీ లో పైకి రావాలంటే హార్డ్ వర్క్ మరియు టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కచ్చితంగా ఉండాలి అంటారు..కొంతమందికి టాలెంట్ లేకపోయినా కేవలం అదృష్టం మీద టాప్ స్టార్ హీరో గా లేదా టాప్ డైరెక్టర్ గా ఎదిగిన వాళ్ళని ఎంతో మందిని ఇప్పటి వరుకు మనం చూసుంటాము ..అలాగే అద్భుతమైన ప్రతిభ ఉన్న డైరెక్టర్లు మరియు హీరోలు అదృష్టం లేకపోవడం వల్ల టాప్ చైర్ ని దక్కించుకోలేకపోయిన వాళ్ళని చూసాము..అలాంటి దర్శకులలో ఒక్కరే వేణు శ్రీరామ్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన వకీల్ సాబ్ సినిమాకి దర్శకుడు ఈయన..చాలా కాలం నుండి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ కి వకీల్ సాబ్ లాంటి సూపర్ హిట్ సినిమాని పవర్ స్టార్ కి మరియు ఆయన అభిమానులకు గిఫ్ట్ గా ఇచ్చాడు..హిందీ లో అమితాబ్ బచ్చన్ హీరో గా నటించిన పింక్ సినిమాకి రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కబోతుంది అని ప్రకటన రాగానే పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా కృంగిపోయ్యారు..దానికి కారణం ఏమిటి అంటే పింక్ సినిమా పవన్ కళ్యాణ్ ఇమేజి తగిన సినిమా కాదు..అది ఒక ఆఫ్ బీట్ సినిమా.

Also Read: Gopichand- Director Teja: హీరో గోపిచంద్ విషయంలో దర్శకుడు తేజ చేసిన తప్పు ఏంటి?
కానీ వేణు శ్రీరామ్ టీజర్ నుండే అభిమానులను ఆశ్చర్యపరుస్తూ పవన్ కళ్యాణ్ స్టైల్ లో సినిమాని మార్చి తీసాను అనే హింట్ ని అభిమానులకు అందించాడు..ఇక సినిమా విడుదలైన తర్వాత ముఖ్యమైన సబ్జెక్టు ని పక్కదారి పట్టించకుండా, పవన్ కళ్యాణ్ ఇమేజి కి తగట్టు సన్నివేశాలు రాసుకొని అభిమానులకు పూనకాలు రప్పించేలా చేసాడు..ఒక్క స్టార్ ని నాన్ కమర్షియల్ మూవీలో ఇంత అద్భుతంగా హ్యాండిల్ చేసిన విధానం ప్రతి ఒక్కరికి నచ్చింది..వేణు శ్రీరామ్ లో గొప్ప విషయం ఉంది అని అందరూ పొగిడారు కానీ..అవకాశాలు మాత్రం ఆయనకీ రావట్లేదు..గతం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో ‘ఐకాన్ – కనుబడుటలేదు’ అనే సినిమాని ప్రకటించాడు..కానీ ఇప్పటి వరుకు ఆ సినిమా అసలు ఉందా లేదా అనే క్లారిటీ కూడా లేకుండా పోయింది..వకీల్ సాబ్ సినిమాకి ముందు ఆయన హీరో నాని తో MCA , సిద్దార్థ్ తో ఓ మై ఫ్రెండ్ వంటి సినిమాలు తీసాడు..వీటిల్లో MCA పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబడగా..ఓ మై ఫ్రెండ్ యావరేజి గా నిలిచింది..కానీ రెండు సినిమాలలో వేణు శ్రీరామ్ టేకింగ్ చూసే ప్రతి ఒక్కరికి అద్భుతంగా అనిపించింది..ఇంత గొప్ప టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో వేణు శ్రీరామ్ కి అవకాశాలు మాత్రం రావడం లేదు..కెరీర్ లో వకీల్ సాబ్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో వేణు శ్రీరామ్ జాతకం ఇక మారిపోతుందని అందరూ అనుకున్నారు..కానీ ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం..స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే కనీసం ఈయనకి టైర్ 2 హీరోలు కూడా అవకాశాలు ఇవ్వడం లేదు..ప్రస్తుతం ఈయన ఇంట్లోనే ఖాళీగా స్క్రిప్ట్స్ రాసుకుంటూ ఉంటున్నాడు.

[…] Also Read:Vakeel Saab Director: వకీల్ సాబ్ డైరెక్టర్ పరిస్థి… […]