https://oktelugu.com/

Khadgam Heroine : ‘ఖడ్గం’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

సినిమాల్లో సీరియస్ గా నటిస్తున్న క్రమంలోనే హర్షద్ రానా అనే నటుడిని పెళ్లి చేసుకుంది. అయితే వీరు ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 20, 2023 / 11:51 AM IST
    Follow us on

    Khadgam Heroine : ఒకటి, రెండు సినిమాల్లో నటించి అలరించిన కొందరు హీరోయిన్లు ఆ తరువాత కనిపించకుండా పోతున్నారు. కానీ నేటి కాలంలో సోషల్ మీడియా కారణంగా వారు ఎక్కడ ఉన్నారో ఈజీగా తెలిసిపోతుంది. అయితే గతంలో ఈ అవకాశం లేకపోవడంతో చాలా మంది స్టార్ హీరోయిన్లు కనిపించకుండా వెళ్లారు. ఒకప్పుడు కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ‘ఖడ్గం’ మూవీ అందరికీ ఎమోషన్ తెప్పించింది. మల్టీస్టారర్ గా వచ్చిన ఈ మూవీలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ లు నటించారు. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా సంగీత, సోనాలి బింద్రే లు నటించారు. అయితే ఇందులో శ్రీకాంత్ ను లవ్ చేసే అమ్మాయి గా నటించిన హీరోయిన్ గుర్తుందా? ఆమె లేటేస్ట్ ఫోటోస్ షాక్ తెప్పిస్తున్నాయి.

    2002లో వచ్చిన ‘ఖడ్గం’ మూవీకి కృష్ణవంశీ డైరెక్షన్ చేశారు. అప్పటి వరకు ఫ్యామిలీ చిత్రాలు తీసిన ఆయన ఈసారి దేశభక్తి కాన్సెప్టును ఎంచుకున్నాడు. ఇందులో ప్రతీ పాత్ర కీలకంగానే కనిపిస్తుంది. ఓ వైపు ఉగ్రవాదాన్ని చూపిస్తూ.. మరోవైపు భావోద్వేగాలను తెప్పించాడు. వీటితో పాటు లవ్ ట్రాక్ ను కూడా అందంగా చూపించారు కృష్ణ వంశీ. ఇందులో ప్లాష్ బ్యాక్ కథగా శ్రీకాంత్, సోనాలి బింద్రే లది చూపిస్తారు. ఆ తరువాత సోనాలి బ్రిందే ఉగ్రవాదుల చేతిలో మరణించాక శ్రీకాంత్ పోలీస్ పాత్రలో కొనసాగుతాడు.

    ఈ క్రమంలో శ్రీకాంత్ ను ప్రేమించే అమ్మాయిగా కిమ్ శర్మ నటించింది. ఈమె బాలీవుడ్ హీరోయిన్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా నటించింది. అయితే ‘ముసుగు వేయొద్దు మనసుమీద’ అనే సాంగ్ లో మాత్రం హాట్ హాట్ గా కనిపించి ఆకట్టుకుంది. సంగీత, సొనాలి బింద్రే లాంటి హీరోయిన్ ఉన్నా.. కిమ్ శర్మకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అయితే ఈ భామ ఆ తరువాత తెలుగులో కనిపించలేదు. బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది.

    సినిమాల్లో సీరియస్ గా నటిస్తున్న క్రమంలోనే హర్షద్ రానా అనే నటుడిని పెళ్లి చేసుకుంది. అయితే వీరు ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయారు. ఆయనతో విడాకులు తీసుకున్న కిమ్ శర్మ ఆ తరువాత ఒంటరిగానే ఉంటోంది. ఇటీవల ఈమెకు సంబంధించిన లేటేస్ట్ పిక్స్ అలరిస్తున్నాయి. కిమ్ శర్మ అప్పటికీ ఇప్పటికీ తన అందచందాలతో అలరిస్తోంది. ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా ఉన్న ఆమెను చూసి ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.