https://oktelugu.com/

Karthika Deepam: బుల్లి తెర బ్లాక్ బస్టర్ సీరియల్ ‘కార్తీక దీపం’ లో వంటలక్క కి ఛాన్స్ ఎలా దక్కిందో తెలుసా ?

Karthika Deepam: ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ప్రేక్షకులనే కాకుండా సెలబ్రెటీలను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో నటించే నటీనటులు మాత్రం ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా వాళ్ళ పాత్రల విషయంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇందులో వంటలక్కగా పాత్ర పోషిస్తున్న దీప మాత్రం ప్రేక్షకుల మదిలో గుడి కట్టేసుకుంది. ఇక ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీకి కార్తీకదీపం సీరియల్ తో పరిచయం కాగా ఈ సీరియల్స్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 16, 2022 / 10:24 AM IST
    Follow us on

    Karthika Deepam: ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ప్రేక్షకులనే కాకుండా సెలబ్రెటీలను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో నటించే నటీనటులు మాత్రం ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా వాళ్ళ పాత్రల విషయంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇందులో వంటలక్కగా పాత్ర పోషిస్తున్న దీప మాత్రం ప్రేక్షకుల మదిలో గుడి కట్టేసుకుంది.

    ఇక ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీకి కార్తీకదీపం సీరియల్ తో పరిచయం కాగా ఈ సీరియల్స్ ద్వారానే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదండోయ్ స్టార్ హీరోల సినిమాలు కూడా మన వంటలక్క ముందు తగ్గాల్సిందే. ఏ స్టార్ హీరోల సినిమాలు వచ్చినా కూడా రేటింగ్ లో మాత్రం వంటలక్కనే ముందుంటుంది.

    ఇక ఈ వంటలక్కకు కార్తీకదీపం సీరియల్ లో ఛాన్స్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. మన వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్. ఈమె కేరళ రాష్ట్రానికి చెందిన నటి. ఇక లా పూర్తి చేసి లీగల్ అడ్వైజర్ గా చేసింది. ఆ తర్వాత ఫోటోగ్రఫీ గా కూడా పనిచేసింది. ఇక తనకు నటన మీద ఆసక్తి ఉండటంతో మొదట మోడలింగ్ రంగంలో పని చేసింది.

    ఆ సమయంలో తనకు మలయాళం సీరియల్ కరతముత్తులో అవకాశం రావడంతో అందులో వంటలక్క తన ఎక్స్ ప్రెషన్స్ తో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో కూడా నటించింది. ఇక ఆ కరతమత్తు సీరియలే తెలుగులో కార్తీకదీపంగా ప్రసారమవుతుంది. ఇక్కడ కూడా ప్రేక్షకులకు ఈ సీరియల్ బాగా ఆకట్టుకుంది. ఇక్కడ కూడా వంటలక్క తన ఎక్స్ ప్రెషన్స్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.