Homeఎంటర్టైన్మెంట్10th Class Movie Heroine: టెన్త్ క్లాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది? ఏం...

10th Class Movie Heroine: టెన్త్ క్లాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?

10th Class Movie Heroine: మిలీనియం బిగినింగ్ లో ప్రేమ కథా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. నువ్వు నేను, నువ్వే కావాలి, ప్రేమిస్తే(Premisthe), బృందావన కాలనీ, జయం వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేశాయి. ఈ క్రమంలో టెన్త్ క్లాస్ మూవీ గురించి చెప్పుకోవాల్సిందే. 2006లో విడుదలైన టెన్త్ క్లాస్ సైతం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీలో నటించిన శరణ్య నాగ్ యువతలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.

టెన్త్ క్లాస్ మూవీలో భరత్(Bharat) హీరోగా నటించాడు. ఆయనకు జంటగా శరణ్య నాగ్(Saranya Nag) నటించింది. టెన్త్ క్లాస్ మూవీ సందేశంతో కూడిన లవ్ డ్రామా. తెలిసీ తెలియని ప్రాయంలో ప్రేమలో పడితే తర్వాత ఎదురయ్యే పర్యవసానాలు ఏమిటనేది చెప్పారు. టెన్త్ క్లాస్ మూవీ హిట్ కావడంతో శరణ్య నాగ్ కి ఫేమ్ వచ్చింది. కాగా శరణ్య ప్రేమిస్తే సినిమాలో హీరోయిన్ సంధ్య ఫ్రెండ్ రోల్ చేసింది. ప్రేమిస్తే సైతం భారీ హిట్ కొట్టింది. ప్రేమిస్తే, టెన్త్ క్లాస్ చిత్రాలు శరణ్యను పాప్యులర్ చేశాయి.

Also Read: Love Mouli Movie Review: లవ్ మౌళి మూవీ రివ్యూ…

టెన్త్ క్లాస్ అనంతరం వరుసగా తమిళ చిత్రాలు చేసింది. టెన్త్ క్లాస్ చిత్రానికి దర్శకత్వం వహించిన చందు ప్రేమ ఒక మైకం టైటిల్ తో ఓ చిత్రం చేశాడు. ఛార్మి కౌర్, రాహుల్ ప్రధాన పాత్రలు చేశారు. శరణ్య నాగ్ ఓ కీలక పాత్ర చేసింది. అలాగే మంచు విష్ణు, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన దూసుకెళ్తా చిత్రంలో శరణ్య ఓ రోల్ చేసింది. 2014 తర్వాత శరణ్య సిల్వర్ స్క్రీన్ కి దూరం అయ్యింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమె ప్రస్థానం మొదలు కాగా, పెళ్లితో అది ముగిసింది.

Also Read: Satyabhama Movie Review: సత్యభామ ఫుల్ మూవీ రివ్యూ…

తమిళ చిత్రం మూయల్ ఆమె చివరి చిత్రం. వివాహం అనంతరం ఆమె నటనకు గుడ్ బై చెప్పింది. వివాహం అనంతరం ఆమె లుక్ పూర్తిగా మారిపోయింది. చాలా బొద్దుగా తయారైంది. సాంప్రదాయ దుస్తుల్లో వీడియోలు, ఫోటోలు చిత్రీకరించి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. ఆ విధంగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. ఒకప్పటి శరణ్య లుక్ ఇప్పటి లుక్ కి పొంతన లేదు. దాంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె మరలా నటిస్తే చూడాలని ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular