Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Movie: 50 లక్షలతో తీసిన చిరంజీవి సినిమా అప్పట్లో ఎంత వసూలు చేసిందో తెలుసా?

Chiranjeevi Movie: 50 లక్షలతో తీసిన చిరంజీవి సినిమా అప్పట్లో ఎంత వసూలు చేసిందో తెలుసా?

Chiranjeevi Movie: టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరులాగా ఉండే హీరో మెగాస్టార్ చిరంజీవి..ఆయన చేసిన 152 సినిమాలలో అత్యధిక శాతం భారీ విజయాలు తెచ్చిపెట్టి ఆయనని మెగాస్టార్ గా , నెంబర్ 1 హీరోగా సుమారు మూడు దశాబ్దాలు ఉండేలా చేసింది కమర్షియల్ సినిమాలే..ఇక ఆ రోజుల్లో చిరంజీవి సినిమాలు ఎంతో అద్భుతంగా ఉండేవి..మాస్ హీరో గా అంచలంచలుగా ఎదుగుతున్న సమయం లో చిరంజీవి ని కమర్షియల్ గా తిరుగులేని స్టార్ గా నిలబెట్టిన సినిమా ‘అడవి దొంగ’..ఈ సినిమా సమయం లోనే స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారు సినిమాలను వదిలిపెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు..రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన నెంబర్ స్థానం లోకి ఎవరు వస్తారా అని ఎదురు చూసిన వారికి మెగాస్టార్ చిరంజీవి ‘అడవి దొంగ’ సినిమా ద్వారా నేనున్నాను అని చెప్పకనే చెప్పాడు..అప్పటికే ఇండస్ట్రీ లో తిరుగులేని కమర్షియల్ స్టార్ డైరెక్టర్ గా చలామణి అవుతున్న K రాఘవేంద్ర రావు గారు ఈ సినిమాకి దర్శకుడు కావడం తో భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైంది.

Chiranjeevi Movie
Chiranjeevi

Also Read: Pawan Kalyan: ఈ ఒక్క ఫొటో చాలు పవన్ కళ్యాణ్ స్టామినా తెలుపడానికి.. ఆ ఫొటో వైరల్ వెనుక కథ!

ఈ సినిమా కి ఉన్న మరో విశేషం ఏమిటి అంటే అప్పట్లో ‘టార్జాన్’ నేపథ్యం లో వచ్చిన మొట్టమొదటి సినిమా కూడా ఇదే..ఇప్పుడంటే చిరంజీవి ఏడాదికి ఒక సినిమా చేస్తున్నాడు కానీ..ఆరోజుల్లో చిరంజీవి ఏడాదికి కనీసం 6 సినిమాలు చేసేవాడు..విజేత మరియు అడవి దొంగ సినిమాలు అప్పట్లో కేవలం నెల రోజుల వ్యవధిలో విడుదలైంది..విజేత సినిమా హిట్ కాగా..అడవి దొంగ సినిమా సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..తొలుత ఈ సినిమాకి అభిమానుల్లో కాస్త డివైడ్ టాక్ ఉండేది..ఎందుకంటే చిరంజీవి ఫస్ట్ హాఫ్ మొత్తం మాట్లాడడు..అది అభిమానులకు ప్రారంభం లో తీసుకోవడం కాస్త కష్టం అయ్యింది..కానీ సినిమా థియేటర్స్ లో రన్ అవుతున్న కొద్ది మెళ్ళిగా టాక్ పెరిగి సెన్సషనల్ హిట్ గా నిలిచింది..కేవలం 50 లక్షల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, మొదటి వారం లోనే 80 లక్షలకు పైగా వసూళ్లను సాధించి సెన్సేషన్ సృష్టించింది..కేవలం ఓపెనింగ్స్ తో ఈ సినిమా సరిపెట్టలేదు..ఫుల్ రన్ కూడా ఇరగ కుమ్మేసింది..అప్పట్లోనే ఈ సినిమా దాదాపుగా 4 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇక హైదరాబాద్ లో అయితే అప్పట్లో విడుదల రోజు ఏకంగా 5 థియేటర్స్ మరియు 5 షోస్ తో ప్రదర్శితమయ్యి సెన్సేషన్ సృష్టించింది..ఇప్పుడంటే హైదరాబాద్ లో వీధికి ఒక మల్టీప్లెక్స్ ఉండేది కానీ,ఆ రోజుల్లో ఇలా ఉండేది కాదు.

Chiranjeevi Movie
Chiranjeevi Adavi Donga

Also Read: Nagababu: అన్నయ్య తప్ప అందరూ నటించారు.. భీమవరం సభపై నాగబాబు షాకింగ్ కామెంట్
Recommended Videos
చిరంజీవి సంచలన నిర్ణయం | Megaster Chiranjeevi Shocking Decision | Acharya Distributors | Ram Charan
Chiranjeevi and Nagarjuna Crying After Watching Laal Singh Chaddha Movie || Aamir Khan || Rajamouli
రామ్ చరణ్ తో బాహుబలి వంటి భారీ బడ్జెట్ సినిమా || Ram Charan Movie With Bollywood Top Dorector
Megastar Chiranjeevi Shocking Decision || Chiranjeevi OTT Platform || Oktelugu Entertainment

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version