Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారి సంపాదన చాలా విధాలుగా ఉంటుంది. కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు ఎన్నో విధాలుగా సంపాదిస్తుంటారు. అయితే సెలబ్రెటీలందరికి కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటివి ఉపయోగిస్తుంటారు. ఇక ఈ సోషల్ మీడియా ద్వారా చాలా సంపాదిస్తుంటారు సెలబ్రెటీలు. మరి మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్, హీరోలు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? అయితే ఒకసారి ఆ వివరాలు ఏంటో తెలుసుకోండి.
రష్మిక: పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ గా మారింది రష్మిక మందన. ఈ సినిమాకు సీక్వెల్ లో నటించి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. అయితే ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా ఏదైనా ఒక పోస్ట్ చేశారు అంటే సుమారు రూ.30 లక్షల వరకు ఛార్జ్ చేస్తుంటుందట ఈ నేషనల్ బ్యూటీ.
కాజల్ అగర్వాల్: కాజల్ అగర్వాల్ కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. చందమామ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్స్ ను సంపాదించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఒక పోస్టుకు రూ. 50లక్షల వరకు చార్జ్ చేస్తుంటుందట.
సమంత: సమంతకు సోషల్ మీడియాలో ఏకంగా 30 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో ఏదైనా ఒక పోస్ట్ చేస్తే రూ. 50 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుందట.
పూజా హెగ్డే: ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది పూజ. ముకుంద సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంది. దీంతో ఎంతో మంది అభిమానులు ఈమె సొంతమయ్యారు. అయితే ఈమె కూడా ఒక పోస్ట్ కు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు చార్జ్ చేస్తుంటుందట.
మహేష్ బాబు.. సౌత్ ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన ఏదైనా బ్రాండ్ ను ప్రమోట్ చేయాలంటే లక్షల్లో కాదు కోట్లలో ఉంటుందట రెమ్యూనరేషన్. సాధారణంగా రెండు కోట్లు ఛార్జ్ చేస్తారట మహేష్ బాబు.