Sreemukhi Remuneration: బుల్లితెర యాంకర్లలో శ్రీముఖికి ఓ ప్రత్యేకత ఉంది. ఆమె అందంతో పిచ్చెక్కించేస్తుంది. మాటలతో మైమరపింపచేస్తుంది. కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది. యువతరాన్ని ఉర్రూతలూగిస్తోంది. తన కంటూ ఓ స్పెషల్ మూమెంట్ తెచ్చుకుని రాములమ్మగా పిలవబడే శ్రీముఖికి యాంకర్లందరిలో మంచి క్రేజీ ఉందంటే అతిశయోక్తి కాదు. తన అందంతోనే అందరిని మంత్రముగ్దుల్ని చేస్తుంది. చాలా మంది ఆమెను చూడటానికే షో లు చూస్తున్నారనేది కూడా కాదనలేని వాదన. ఈ నేపథ్యంలో ఆమె బుల్లితెరలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది.

యాంకర్లందరిలో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేది సుమ. ఆమె ఒక్కో ఈవెంట్ కు రూ. 6 లక్షల వరకు తీసుకుంటున్నట్లు టాక్. శ్రీముఖి రూ. 3 లక్షలు తీసుకుంటుందట. సుమ తరువాత యాంకర్ గా శ్రీముఖికే ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది. ఈటీవీ పటాస్ షో తో గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ప్రస్తుతం అన్ని చానళ్లలో కూడా ఈవెంట్లు చేస్తూ అందరిని అబ్బురపరుస్తోంది. తన అందంతో ఆకట్టుకుంటోంది. మాటలతో మైమరపింపచేస్తోంది. ఈ అందాల భామ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల పూలు పూస్తాయి.

ఇటీవల ఈటీవీలో ప్రసారమయ్యే జాతిరత్నాలులో కూడా శ్రీముఖి యాంకర్ గా కొనసాగుతోంది. దీంతో పాటు జీ తెలుగు, స్టార్ మా వంటి టీవీల్లో కూడా షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. రెండు చేతులా సంపాదిస్తోంది. తన కెరీర్ ను అందంగా మలుచుకుంటూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు అందం ఉన్నప్పుడు అన్ని సమకూర్చుకోవాలని చూస్తోంది. దీని కోసమే తన ప్రస్థానాన్ని బ్రేకులు లేకుండా కొనసాగిస్తోంది. అభిమానులను సంపాదించుకుంటోంది.
ఈ మధ్య ఓ యూట్యూబ్ చానల్ ప్రారంభించి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటోంది. వారితో ముచ్చటిస్తూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటోంది. ఇంకా తన ప్రయాణంలో ఏవైనా సలహాలు, సూచనలు చేయాలని సూచిస్తోంది. దీంతో నిరంతరం అభిమానులను రంజింపచేస్తోంది. ఎంత ఖర్చయినా ఫర్వాలేదని శ్రీముఖిని యాంకర్ గా పెట్టుకుంటున్నారు. ఆమె వస్తేనే షోకు అందం వస్తుందని అందరు భావిస్తున్నారు. అందుకే శ్రీముఖికి ఇప్పటికి కూడా ఏ మాత్రం విలువ తగ్గలేదు.
Recommended Videos:
[…] […]