https://oktelugu.com/

Samantha: ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కోసం సమంత ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా..? మాజీ భర్త నాగ చైతన్య రెమ్యూనరేషన్ కి డబుల్ మార్జిన్!

ముఖ్యంగా ఈమెకి ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉంది. 1 మిలియన్ గ్రాస్ డాలర్స్ ఈమె సినిమాలకు అక్కడ అవలీలగా వచ్చేస్తాయి. అందుకే ఈమెని అభిమానులు ఓవర్సీస్ క్వీన్ అని పిలుస్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే ఈమె సినిమాలు మాత్రమే కాకుండా, వెబ్ సిరీస్ లో కూడా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : November 12, 2024 / 09:42 AM IST

    Samantha(5)

    Follow us on

    Samantha: సౌత్ ఇండియా లో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్, బ్రాండ్ ఇమేజి ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత కచ్చితంగా టాప్ 3 లో ఉంటుంది. మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ తోనే స్టార్ ఇమేజి ని సంపాదించుకున్న సమంత, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కెరీర్ ప్రారంభంలోనే ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి సూపర్ స్టార్స్ తో సినిమాలు చేయడం. ఈమె అదృష్టం కలిసొచ్చి అవి కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో సమంత కి సౌత్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. అలా కమర్షియల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత కి, నాగ చైతన్య తో పెళ్లి తర్వాత ఆమె ఆలోచన విధానం మారింది. ఇక నుండి కేవలం రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలనీ ఫిక్స్ అయ్యింది. అలా ఆమె ఓ బేబీ, యూ టర్న్, యశోద, శాకుంతలం వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది. వీటిల్లో ఓ బేబీ, యశోద సినిమాలు కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యాయి.

    ముఖ్యంగా ఈమెకి ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉంది. 1 మిలియన్ గ్రాస్ డాలర్స్ ఈమె సినిమాలకు అక్కడ అవలీలగా వచ్చేస్తాయి. అందుకే ఈమెని అభిమానులు ఓవర్సీస్ క్వీన్ అని పిలుస్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే ఈమె సినిమాలు మాత్రమే కాకుండా, వెబ్ సిరీస్ లో కూడా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమె చేసిన మొట్టమొదటి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ లో సమంత విలన్ గా నటించింది. ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన రాజ్ & డీకే రీసెంట్ గా సమంత ని ప్రధాన పాత్రలో పెట్టి ‘సీటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేసింది. నవంబర్ 7 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో సమంత రా ఏజెంట్ గా, ఒక బిడ్డకి తల్లిగా అద్భుతమైన క్యారక్టర్ చేసింది. అదే విధంగా ఇందులో బోల్డ్ సన్నివేశాలు కూడా చాలానే ఉన్నాయి.

    అంతే కాదు యాక్షన్ సన్నివేశాల్లో సమంత కి చాలా దెబ్బలు కూడా తగిలాయి. మయోసిటిస్ కారణంగా శరీరం శక్తి లేకపోయినా, షాట్స్ కి మధ్య గ్యాప్ లో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని మరీ ఈ సినిమాని చేసింది. ఇంత కష్టపడిన సమంత కి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారో అని అందరూ అనుకుంటూ ఉన్నారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం , సమంత ఈ సిరీస్ కోసం 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సిరీస్ లో హీరో గా నటించిన వరుణ్ ధావన్ మాత్రం కేవలం 8 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. దీనిని బట్టి సమంత రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.