Devisri Prasad remuneration: సౌత్ ఇండియా లో తన అద్భుతమైన మ్యూజిక్ తో దశాబ్దాల నుండి అలరిస్తూ, లెజెండరీ స్థాయిని సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్(Devisri Prasad), ‘ఎల్లమ్మ'(Yellamma Movie) చిత్రంతో హీరో గా మారిపోయాడు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ‘గ్లింప్స్’ వీడియో ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా గ్లింప్స్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ లో ఉంది. ఈ చిత్రానికి సంగీతం కూడా దేవిశ్రీ ప్రసాద్ నే అందిస్తున్నాడు. బలగం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో హీరో నటిస్తున్నందుకు, అదే విధంగా మ్యూజిక్ అనిడిస్తున్నందుకు దేవి శ్రీ ప్రసాద్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ తన ప్రతీ సినిమాకు పది నుండి 15 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటాడు. కానీ ఈ చిత్రానికి హీరో + మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి పాతిక నుండి 30 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకోబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త. ఇదే కనుక నిజమైతే దేవిశ్రీ ప్రసాద్ రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయినట్టే అనుకోవచ్చు. తమిళంలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కూడా ఇదే విధంగా హీరో గా మారాడు. ఇప్పటి వరకు ఎలాంటి సక్సెస్ ని హీరో గా ఆయన అందుకోలేదు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాడు. మరి దేవి శ్రీప్రసాద్ కెరీర్ హీరో గా ఎలా ఉండబోతుందో చూడాలి. గ్లింప్స్ లో ఆయన లుక్ ని చూసిన తర్వాత అభిమానులు సంతృప్తి చెందారు.
ఈ చిత్రాన్ని ముందుగా నాని తో చేద్దామని అనుకున్నారు, ఆ తర్వాత నితిన్ వద్దకు వెళ్ళింది , చివరికి దేవిశ్రీప్రసాద్ వరకు వెళ్ళింది. ఇప్పుడు ఆయన ఈ చిత్రానికి ఎంతమేరకు ఎఫోర్ట్స్ పెడుతాడు అనేది చూడాలి. ఇదంతా పక్కన పెడితే మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి పని చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ చిత్రం ‘దేఖ్లేంగే సాలా’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ చిత్రం నుండి రెండవ పాట కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. కానీ దేవిశ్రీ ప్రసాద్ పాత సినిమాల రేంజ్ లో ఈ చిత్రం లోని పాటలు క్లిక్ అవుతాయా లేదా అనే చిన్నపాటి సందేహం అభిమానుల్లో ఉంది.