Bigg Boss 8 Telugu Finale LIVE: ఈ సీజన్ బిగ్ బాస్ షో డిజాస్టర్ కాకుండా, యావరేజ్ రేంజ్ అవ్వడానికి ముఖ్య కారణం విల్ కార్డు కంటెస్టెంట్స్ అనడం లో ఎలాంటి సందేహం లేదు. మొదటి 5 వారాలు ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే అవినాష్ వచ్చాడో, అప్పుడు ఎంటర్టైన్మెంట్ తారాస్థాయికి చేరుకుంది. బోలెడంత టీఆర్ఫీ కంటెంట్ వచ్చింది. మధ్యలో రావడం వల్ల ఆయనకి ఆడియన్స్ సపోర్ట్ అనుకున్న రేంజ్ లో దొరకలేదు కానీ, కష్టపడి టాస్కులు ఆడి రెండు సార్లు మెగా చీఫ్ అయ్యాడు, టికెట్ టు ఫినాలే షీల్డ్ గెలుచుకున్నాడు, టాప్ 5 వరకు వచ్చాడు. కచ్చితంగా ఈయన 5వ స్థానం లో ఎలిమినేట్ అవుతాడని అందరూ ఊహించారు. ఊహించినట్టుగానే 5 వ స్థానం లో ఎలిమినేట్ అయ్యాడు. కానీ అవినాష్ కి ఉపేంద్ర లాంటి లెజెండ్ తో కలిసి బయటకి వచ్చే అదృష్టం దొరికింది. ఆయన పంచిన ఎంటర్టైన్మెంట్ కి గొప్ప పురస్కారం దొరికింది అనే చెప్పొచ్చు.
టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ కి పది లక్షల సూట్ కేసు ఆఫర్ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. అవినాష్ కి సూట్ కేసు అందించి ఉంటే బాగుండేది అని ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. స్టేజి మీదకు వచ్చిన తర్వాత కూడా అవినాష్ నాగార్జున తో కలిసి కామెడీ చేసాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ తో కూడా అద్భుతమైన కామెడీ అందించాడు. ఈ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ని అందించిన కంటెస్టెంట్ ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీ లో ఎవ్వరూ లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అవినాష్ కి రెమ్యూనరేషన్ మాత్రం భారీ రేంజ్ లోనే ఇచ్చారట. రోజుకి ఆయనకి 35 వేల రూపాయిలు ఇచ్చేందుకు బిగ్ బాస్ అగ్రిమెంట్ కుదిరించుకున్నారు అట. ఆ అగ్రిమెంట్ ప్రకారం 70 రోజులు ఆయన హౌస్ లో ఉన్నందుకు గాను 24 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నట్టు