Amitabh Bachchan Remuneration: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘#OG’. ప్రముఖ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై అప్పుడే మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుందట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ తో బిజీ అవ్వడం వల్ల కొంతకాలం వరకు షూటింగ్ కి విరామం ఇచ్చాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ జులై నెలలో ప్రారంభం అవ్వబొయ్యే నాల్గవ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు.
ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై ఒక పాట, కొన్ని కీలక సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం గా తెరకెక్కుతుంది. స్టార్ క్యాస్టింగ్ కూడా భారీగానే సెట్ చేస్తున్నాడు డైరెక్టర్ సుజిత్. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిసున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఆయన షూటింగ్ లో పాల్గొన్నాడు.
ఇక ఈ చిత్రం లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పవన్ కళ్యాణ్ తండ్రి క్యారక్టర్ కోసం గత కొంత కాలం గా అన్వేషణ జరుగుతుంది. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఫేమ్ అనుపమ్ ఖేర్ ని తీసుకుందాం అనుకున్నారు. కానీ అతనికంటే బెస్ట్ గా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోసం సంప్రదిస్తున్నారట. ప్రస్తుతం ప్రాజెక్ట్ K సినిమాతో ఫుల్ బిజీ గా ఉన్న అమితాబ్ బచ్చన్, #OG సినిమాకి కూడా డేట్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. 15 రోజుల పాటుగా అమితాబ్ బచ్చన్ కి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తారట.
ఇందులో ఆయన నటిస్తున్నందుకు గాను 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అంటే రోజుకి కోటి రూపాయిలు అన్నమాట, మేకర్స్ అందుకు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ కి ప్రస్తుతం ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఎవ్వరూ కూడా ఇవ్వలేదు, కానీ తెలుగు సినిమా దగ్గరకి వచ్చేలోపు ఆయన ఇంత డిమాండ్ చేస్తున్నాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.