Nayanthara: హీరోయిన్ నయనతార గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ తో పాటు నార్త్ లో కూడా సినిమాలు చేస్తూ ఈమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమాలో నటించే హీరో హీరోయిన్లు ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క కమర్షియల్ యాడ్లో కూడా నటిస్తారు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ క్రమంలో చాలామంది స్టార్ సెలబ్రిటీలు పలు యాడ్లలో కూడా నటించారు. తాజాగా ఇదే క్రమంలో హీరోయిన్ నయనతార గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక చిన్న యాడ్ కోసం నయనతార దాదాపు 5కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు ప్రస్తుతం ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తుంది. ఈ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ నయనతార లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. నయనతార కేవలం 50 సెకండ్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకుందని సమాచారం. తాజాగా ఓ డిటిహెచ్ యాడ్ షూట్లో పాల్గొన్న లేడీ సూపర్ స్టార్ ఈ భారీ మొత్తాన్ని తన రెమ్యూనరేషన్ గా ఛార్జ్ చేసిందని సమాచారం. ఇక ప్రస్తుతం ఈమె తెలుగు తోపాటు తమిళ్, హిందీ భాషలలో కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఒకపక్క నయనతార కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది.. ఇక నయన్ ఒక్కో సినిమాకు గాను 12 నుంచి 15 కోట్ల రూపాయలు పారితోషకం వసూలు చేస్తుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు యాడ్స్ లో కూడా తన హవా చూపిస్తూ భారీ మొత్తాన్ని అందుకుంటుంది నయన్. నయనతార కేరళకు చెందిన అమ్మాయి.
కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ఈమె మోడలింగ్ చేసే సమయంలో ఈమెను చూసిన మలయాళీ డైరెక్టర్ నయన్ ను మనసునక్కరే అనే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. అలా మలయాళంలో తన కెరీర్ ను ప్రారంభించిన నయనతార ఆ తర్వాత తమిళ్లో అయ్యా, చంద్రముఖి వంటి సినిమాలలో నటించింది. ఇక చంద్రముఖి సినిమాతో నయనతారకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నయనతార వెంకటేష్ హీరోగా నటించిన లక్ష్మి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది.
లక్ష్మి, బాస్ సినిమాలలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు నయనతార తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఇక బాపూ చిత్రం శ్రీరామరాజ్యం లో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకుంది. ఈ సినిమాకు గాను ఆమెకు ఫిలింఫేర్, నంది అవార్డులు కూడా వచ్చాయి. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం లోని విషయాలతో కూడా ఈమె అనేకసార్లు వార్తల్లో నిలిచింది. ఇక ఈమె విగ్నేష్ శివన్ ను జూన్ 9, 2022లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.