Nagarjuna Bigg Boss 10 remuneration: తెలుగు బిగ్ బాస్ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు అక్కినేని నాగార్జున. ఒక్క మాటలో చెప్పాలంటే నాగార్జున(Akkineni Nagarjuna) నేటి తరం ఆడియన్స్ కి తన సినిమాల కంటే ఎక్కువగా, బిగ్ బాస్ షో ద్వారానే సుపరిచితం అయ్యాడు. మూడవ సీజన్ నుండి 9వ సీజన్ వరకు విజయవంతంగా సింగల్ హ్యాండ్ తో నడిపించాడు నాగార్జున. ఆయన లేని బిగ్ బాస్ షో ని ఊహించుకోవడం కూడా కష్టమే. అయితే ‘బిగ్ బాస్ 9’ చరిత్రలో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని సమోదు చేసుకున్న సీజన్ గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే డైలీ సీరియల్స్ కంటే ఎక్కువగా, ఈ సీజన్ కి కనెక్ట్ అయ్యారంటే అతి సయోక్తి కాదేమో. ఈ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కంటెస్టెంట్స్ మధ్య ఉన్న బంధాలు ఒక కారణం అయితే, నాగార్జున హోస్టింగ్ కూడా మరో కారణం అని చెప్పొచ్చు.
గత సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి , ఈ సీజన్ కి నాగార్జున రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లోనే డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సీజన్ మొత్తం హోస్ట్ గా వ్యవహరించడానికి ఆయన 30 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జున హీరో గా ఒక సినిమా చేయడానికి 5 నుండి పది కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు. ఇది కేవలం సినిమా బడ్జెట్ ని బట్టి ఆయన రెమ్యూనరేషన్ మారుతూ ఉంటుంది. ఒక్కోసారి లాభాల్లో వాటాలు అగ్రిమెంట్ చేసుకొని ఫ్లాప్ అయ్యాక కూడా చేతుల్లోకి రానటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆయన మార్కెట్ రేంజ్ ని బట్టి చూస్తే 10 సినిమాలు చేసినా ఇంత రెమ్యూనరేషన్ రాదనీ అంటున్నారు విశ్లేషకులు.
12 వ సీజన్ వరకు ఎండోమెల్ సంస్థ తో అగ్రిమెంట్ ఉంది కాబట్టి, రాబోయే సీజన్స్ కి ఆయన ఇంకా ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. మరి నాగార్జున డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఎండోమెల్ సంస్థ సిద్ధంగా ఉందా?, లేదా భేరాలు ఆడుతారా అనేది చూడాలి. ఇకపోతే ప్రస్తుతం నాగార్జున తన వందవ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ ఏడాది దసరా కి ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నాడు నాగార్జున. ఈ చిత్రం తో పాటు త్వరలోనే ఆయన ‘సోగ్గాడే చిన్ని నాయన’ మూవీ ని కూడా ప్రారంభించబోతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.