Homeఎంటర్టైన్మెంట్Jabardasth Show- Movie Promote: జబర్దస్త్ షో లో ఒక సినిమాకి ప్రమోషన్ చెయ్యాలంటే ఎంత...

Jabardasth Show- Movie Promote: జబర్దస్త్ షో లో ఒక సినిమాకి ప్రమోషన్ చెయ్యాలంటే ఎంత డబ్బులు చెల్లించాలో తెలుసా?

Jabardasth Show- Movie Promote: ఈటీవీ లో ప్రసారం అయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ కి ఎంత ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ ఛానల్ లో ఎంటర్టైన్మెంట్ షోస్ కి వచ్చే TRP రేటింగ్స్ లో సగం కూడా ఇతర చానెల్స్ లో రాకపోవడం విశేషం..అందుకే ఏళ్ళ తరబడి ఈటీవీ ఛానల్ లో ఎంటర్టైన్మెంట్ షోస్ కొనసాగుతూనే ఉన్నాయి..ఈ ఎంటర్టైన్మెంట్ షోస్ అన్నిటికి ఆద్యం పోసిన షో జబర్దస్త్..సుమారు పదేళ్ల నుండి విరామం లేకుండా కొనసాగుతున్న ఈ షో ని చూడండి తెలుగోడు ఎవ్వరు ఉండరు అనడం లో ఎలాంటి సందేహం లేదు..మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ షో ని సుమారు పదేళ్ల నుండి విరామం లేకుండా కొనసాగిస్తున్నారు..ఒకప్పుడు ఈ షో కి 18 TRP రేటింగ్స్ వచ్చేవి..బుల్లితెర మీద ఈ స్థాయి TRP రేటింగ్స్ ని రప్పించుకున్న షో ఇదే కావడం విశేషం..అయితే ఇటీవల కాలం లో సుడిగాలి సుధీర్ మరియు హైపర్ వంటి టాప్ కమెడియన్స్ ఈ షో ని వదిలేయడం తో TRP రేటింగ్స్ 18 నుండి 11 కి పడిపోయింది.

Jabardasth Show- Movie Promote
Jabardasth Show

TRP రేటింగ్స్ తగ్గినప్పటికీ కూడా ఇప్పటికి ఎంటర్టైన్మెంట్ షోస్ లో అత్యధిక TRP రేటింగ్స్ తెచ్చుకుంటున్న షో ఇదే కావడం విశేషం..అయితే ఈ షో ద్వారా కొన్ని చిన్న సినిమాలు ప్రొమోషన్స్ చేసుకునే సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఈ ప్రొమోషన్స్ ఫ్రీ గా చేస్తారేమో అని ఇన్ని రోజులు మనం అనుకున్నాము..కానీ జబర్దస్త్ , కాష్ మరియు ఢీ వంటి ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఒక సినిమా కి ప్రమోషన్ చెయ్యాలంటే 15 లక్షల రూపాయిలు డిమాండ్ చేస్తుందట మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ..ఎంటర్టైన్మెంట్ షోస్ అంటే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ప్రతి ఒక్కరు చూస్తారని..ఒక సినిమాకి ప్రొమోషన్స్ వీటికి మించి ఇంకోటి ఉండదని మేకర్స్ కూడా భావిస్తున్నారు.

Also Read: Sky Glows In Pink Over Australian: ఆస్ర్టేలియాలో గులాబీ వర్ణంలోకి మారిన ఆకాశం.. కారణం ఏంటి?

Jabardasth Show- Movie Promote
Jabardasth Show

అందుకే డబ్బులు ఖర్చు అవుతున్నప్పటికీ కూడా వెనకాడకుండా తమ సినిమాలకు ప్రొమోషన్స్ చేసుకోవడానికి ఆసక్తి ని చూపిస్తుంటారు..పెద్ద హీరో సినిమాలకు ప్రొమోషన్స్ అక్కర్లేదు కానీ..చిన్న హీరోల సినిమాలకు ప్రొమోషన్స్ తప్పనిసరిగా కావాలి..అందుకే ఎంటర్టైన్మెంట్ షోస్ ని మించిన మాధ్యమం మరొకటి లేదని దర్శక నిర్మాతలు అభిప్రాయ పడుతున్నారు.

Also Read:Harsha Bhogle Tweet On Hyderabad: ఎంత ఎదిగినా తెలుగుపై మమకారం చాటుకున్న హర్ష భోగ్లే

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular