Actor Ali: దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అద్భుతమైన చిత్రాలు అందించారు. పలు క్రాఫ్ట్స్ పై పట్టున్న ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు భిన్నంగా ఉండేవి. ఆయన సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, కామెడీ జోనర్స్ లో సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చారు. ఎస్వీ కృష్ణారెడ్డి బెస్ట్ మూవీస్ లో యమలీల ఒకటి. సోషియో ఫాంటసీ సబ్జెక్టు కి మదర్ సెంటిమెంట్ జోడించి యమలీల తెరకెక్కించారు. 1994లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్. వసూళ్ల వర్షం కురిపించింది.
స్టార్ క్యాస్ట్ లేకుండానే సంచలన విజయం నమోదు చేసింది. ఈ మూవీ విశేషాలు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ చిత్రానికి ఆలీ రెమ్యూనరేషన్ ఎంతో కూడా వెల్లడించారు. ఈ కథ ఆలీకి సెట్ అవుతుందని భావించిన ఎస్వీ కృష్ణారెడ్డి… ఆయన్ని పిలిచి నువ్వే హీరో అన్నాడట. ఆలీ ఆశ్చర్యపోయారట. అప్పట్లో ఆలీ రెమ్యూనరేషన్ చాలా తక్కువ అట. యమలీల సినిమాకు ఆలీకి రూ. 50000 పారితోషికం ఇచ్చారట.
ఆలీకి జంటగా సౌందర్యను అనుకున్నారట. అయితే సౌందర్య యమలీల చిత్రాన్ని రిజెక్ట్ చేసిందట. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న నేను కమెడియన్ పక్కన నటిస్తే కెరీర్ కే ప్రమాదం అని ఆమె అన్నారట. సరే నీ ఇష్టం అన్న ఎస్వీ కృష్ణారెడ్డి ఇంద్రజకు ఛాన్స్ ఇచ్చాడట. అలాగే మెయిన్ విలన్ రోల్ కోసం కోటా శ్రీనివాసరావును సంప్రదిస్తే… ఆయన కూడా చేయను అన్నారట. పెద్ద హీరోల చిత్రాల్లో విలన్ గా చేస్తూ ఆలీకి విలన్ గా చేయడం సరికాదని ఆయన అన్నారట.
కోటా శ్రీనివాసరావు విలన్ రోల్ చేయను అనడంతో… ఆ పాత్ర తనికెళ్ళ భరణికి ఇచ్చారట. కొత్త కథ ఖచ్చితంగా ఆడుతుందన్న నమ్మకం నాకు ఉంది. స్టార్స్ చేయను అన్నప్పటికీ చిన్నవాళ్ళతో ఆ సినిమా చేశానని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. పరిశ్రమ కొత్త కథలను ఆదరించదు. కానీ ప్రేక్షకులు ఆదరిస్తారని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. యమలీల విజయంతో కొన్నేళ్లపాటు ఆలీకి హీరోగా వరుస అవకాశాలు వ్ అచ్చయి.
Web Title: Do you know how much ali remuneration for yamaleela movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com