Uday Kiran: టాలీవుడ్ లోకి ఎలాంటి సపోర్టు లేకుండా వచ్చి పెద్ద స్టార్ హీరోగా మారిన వారిలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. ఇతను ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్చుకుని పెద్ద హీరో అయ్యాడు. అయితే ఆయన మీద అప్పట్లో చాలా రూమర్లు వచ్చాయి. ఉదయ్ కిరణ్ ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెడుతున్నాడనే రూమర్ అప్పట్లో ఆయన వద్దకు ప్రొడ్యూసర్లను రాకుండా చేశారు.
కాగా నువ్వునేను మూవీ చాలా పెద్ద హిట్ అయింది. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ కు, డైరెక్టర్ తేజకు చాలా పెద్ద గొడవలు జరిగాయంటూ పుకార్లు షికారు చేశాయి. ఇక దీనికి ఆజ్యం పోసినట్టు నువ్వు నేను మూవీ 100రోజుల వేడుకకు ఉదయ్ కిరణ్ ఆలస్యంగా వచ్చారు. దీంతో అందరూ ఇది నిజమే అనుకున్నారు. పైగా ఉదయ్ కిరణ్ రాకముందే వేడుకలను ప్రారంభించారు.
Also Read: జగ్గారెడ్డి, వీహెచ్ లో రేవంత్ పంచాయితీ ఏంటి?
ఇక కలుసుకోవాలని మూవీ కథ విషయంలో కూడా టాలీవుడ్ లో పెద్ద చర్చేసాగింది. ఈ కథను మార్చాలంటూ ఉదయ్ కిరణ్ చెప్పారంట. దీంతో కృష్ణవంశీ తప్పనిసరి పరిస్థితుల్లో స్క్రిప్టును మార్చారంట. ఇక ప్రొడ్యూసర్లు కూడా ఈ విషయంలో ఉదయ్ కిరణ్‌తో కొంత ఇబ్బంది పడ్డారనే వార్తలు వచ్చాయి.
Uday Kiran
దీంతో ఉదయ్ కిరణ్ ఎదుగుతున్న సమయంలోనే కథల విషయంలో జోక్యం చేసుకుంటారనే పుకార్లు పుట్టించారు. కానీ ఉదయ్ మాత్రం తన సినిమా బాగుండాలనే తపనతోనే మార్చమని చెప్పానని ఇందులో తప్పేముంది అంటూ మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఈ మూవీ విడుదల అయి పర్వాలేదనిపించింది. ఇలా ఉదయ్ కిరణ్ మీద మొదటి నుంచే ఇండస్ట్రీలో ఎన్నో పుకార్లు షికారు చేశాయి.
Also Read: ఆడ గాత్రమే శాపమై.. అవమానాల పాలై.. నేడు టాలెంట్ తో ఎదిగిన కుర్రాడి కథ