Janhvi Kapoor: బాలీవుడ్ నేటి హాట్ స్టార్లలో జాన్వీ కపూర్ ఒకరు. అలనాటి అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు అయిన ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవల ‘మిలి’ అనే చిత్రం ప్రమోషన్ లో భాగంగా జాన్వీ హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దక్షిణాదిలో ఆఫర్ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పింది. అయితే జాన్వీ చేసిన సినిమాలు తక్కువే. కానీ ఆమెకు సోషల్ మీడియాలో 20 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఈ భామ సినిమాల ద్వారా కాకుండా ఇన్ స్టాగ్రాం ద్వారా లక్షలకు లక్షలు పోగేస్తుందట. ఈ క్రమంలో ఆమె ఒక్కో పోస్టుకు ఎంత తీసుకుంటుందో నన్న చర్చ ఆసక్తిగా మారుతోంది.

‘దడక్’ అనే బాలీవుడ్ మూవీతో జాన్వీ ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఘోస్ట్ స్టోరీస్ తదితర సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. అయినా అమ్మడుకు వరుసబెట్టి అవకాశాలు తలుపు తడుతున్నాయి. లేటెస్టుగా ఆమె ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఓటీటీలో రిలీజ్ చేశారు. సినిమాల సంగతి ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం జాన్వీ దూసుకుపోతుంది. ఎప్పటికప్పుడు తన అందాల ఆరబోత ఫొటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. పొట్టి పొట్టి డ్రెస్సులో జాన్వీ చేసే అల్లరికి యూత్ ఫిదా అవుతున్నారు.
అయితే జాన్వీ ఇలా పొట్టి డ్రెస్సులు వేసుకుని ఫోటోలు దిగడానికి ఓ కారణం ఉందట. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో 20.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా పెరుగతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఆమె ఇన్ స్టా ద్వారా తమ బ్రాండ్ లను ప్రమోట్ చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే ‘Nykaa’ అనే ఫ్యాష్ బ్రాండ్ తన ఉత్పత్తులు ప్రచారం చేసుకుంటోంది. వీటికి తోడు జాన్వీ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది.

అయితే కొన్ని కంపెనీలకు జాన్వీ అందాల ఆరబోతతో ప్రమోట్ చేసేందుకు బాగానే వసూలు చేస్తుందట. అలంటి పోస్టుల్లో ఒక్కోదానికి రూ.70 నుంచి 80 లక్షల వరకు చార్జ్ చేస్తుందట. ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ తన EMIలను క్లియర్ చేసేందుకే ఇలా ఆదాయన్ని సేకరిస్తున్నానని తెలిపింది. సోషల్ మీడియాను నేను సరదాగా గడపడానికి వాడుకోను… నేను అందంగా కనిపిస్తే.. నా ఫొటోలను ఎక్కువ మంది లైక్ చేస్తే.. నా ఆదాయం పెరుగుతుంది… అని తెలిపిందట. ఇదిలా ఉండగా జాన్వీ నటించింది కొన్ని సినిమాలే.. కానీ ఆమె ముంబైలోని జుహు ప్రాంతంలో రూ.40 కోట్లు పెట్టి ఇల్లు కొనుగోలు చేయడం విశేషం… అని అనుకుంటున్నారు.