Vishwak Sen Funky: వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలతో డీలాపడినా యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwaksen), ఈ నెల 13 వ తారీఖున ‘ఫంకీ'(Funky Movie) మూవీ తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ హీరో గత చిత్రం ‘లైలా’ ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ఫ్లాప్ అవ్వడమే కాకుండా, విశ్వక్ సేన్ పై తీవ్రమైన విమర్శలు వచ్చేలా చేసింది ఈ సినిమా. ఎప్పుడూ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పని విశ్వక్ సేన్, ఈ సినిమా ఫ్లాప్ అయ్యాక సోషల్ మీడియా లో ప్రేక్షకులకు క్షమాపణలు చెప్తూ ఒక పెద్ద లేఖని విడుదల చేసాడు. దీనిని బట్టీ ఆ చిత్రం విశ్వక్ సేన్ కి ఎంత డ్యామేజ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపై స్క్రిప్ట్ ఎంపిక విషయం లో ఆచి తూచి అడుగులు వేస్తానని మాట ఇచ్చిన విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ ని సెట్ చేశాడు.
జాతి రత్నాలు లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన అనుదీప్ KV దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో నిర్మాణ దశ నుండే మంచి అంచనాలు ఉన్నాయి. దానికి టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడం, మొదటి లిరికల్ వీడియో సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అవ్వడంతో మార్కెట్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. విశ్వక్ సేన్ గత మూడు చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ అయినప్పటికీ ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ డీసెంట్ గానే జరిగింది. పైగా ఈ చిత్రానికి నిర్మాత నాగవంశీ. ఆయన లేటెస్ట్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’ బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. తన ప్రతీ సినిమాకు బయ్యర్స్ శాశ్వతంగా ఫిక్స్ అయ్యి ఉంటారు కాబట్టి, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని 15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు సమాచారం.
అంటే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే కచ్చితంగా 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే రావాలి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 20 కోట్లకు పైగా షేర్ రావాలి. అంత రావాలంటే కచ్చితంగా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావాలి. లేదంటే ఆడియన్స్ కన్నెత్తి కూడా చూడరు. ఇప్పుడు ఉన్న పరితితుల్లో ఒక హీరో ఎవరు అనేది కూడా చూడకుండా, కంటెంట్ బాగుంటే నెత్తిన పెట్టుకొని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఒకవేళ కంటెంట్ లేకపోతే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ సినిమాలను కూడా తోక్కేస్తున్నారు. మరి విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరో పరిస్థితి ఏంటో ఈ సినిమా తో తేలిపోతుంది.