Chiranjeevi Cars: మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక బ్రాండ్. ఆయన సినిమా అంటే ఫ్యాన్స్ లో ఎక్కడా లేని ఉత్సాహం. దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న చిరంజీవి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఎన్నో ప్రయోగాలు చేశారు. ఒక దశలో ఆ సమయంలో మెగాస్టార్ చేసిన డ్యాన్స్ ఏ హీరో చేయలేదు. దీంతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ‘పునాది రాళ్లు’ సినిమా నుంచి నేటి ‘భోళా శంకర్’ వరకు చిరంజీవి సినీ కెరీర్లో ఎన్నో మలుపులు..ఎన్నో ప్రత్యేకతలు.. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రతీ బర్త్ డే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈసారి కడా అలాగే నిలవాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ చిరంజీవికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?
1955 ఆగస్టు 22న మెగాస్టార్ కొణిదెల శివశంకర వరప్రసాద్ జన్మించారు. 1978 నుంచి నటుడిగా మారాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 150కి పైగా చిత్రాల్లో నటించారు. దాదాపు మూడు దశాబ్దాల వారిని తన నటనతో మెప్పించిన చిరంజీవి ఇప్పటికీ నేటి కుర్రాళ్లకు పోటీనిస్తున్నారు. ఈ కాలంలో చిరంజీవి సినిమాల్లోనే కాకుండా ఇతర వ్యాపారంలో ఇన్వెస్ట్ మెంట్లు పెట్టారు. అంతేకాకుండా పలు బ్రాండ్లకు ప్రమోట్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన సంపద విలువ రోజురోజుకు పెరుగుతూ వస్తోది.
మెగాస్టార్ చిరంజీవికి జూబ్లిహిల్స్ లో ఓ పెద్ద భవనం ఉంది. దీని విలువ రూ.30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అలగే బెంగుళూరులోని కోట్ల విలువ చేసే ఓ ఫామ్ హౌస్ ఉంది. కేవలం ఇల్లు మాత్రమే కాకుండా కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. అత్యంత ఖరీదైన, రూ.9 నుంచి రూ.10 కోట్ల విలువ చేసే రాయిల్ ఫాంటమ్, రూ.4 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్, రూ.2.2 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ వోగ్, రూ. 2 కోట్ల విలువ చేసే ల్యాండ్ క్రూయిజ్ ఉన్నాయి. వీటితో పాటు ఒక ప్రైవేట్ జెట్ ఉంది.
కేవలం సినిమాల ద్వారా కాకుండానే పలు వ్యాపారాల ద్వారా మెగాస్టార్ ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆయన ఆస్తుల విలువ రూ.1,650 కోట్లు ఉంటుందని తెలు్తోంది. అయితే కేవలం సంపాద మాత్రమే కాకుండా మెగాస్టార్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిలో ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’ లాంటి సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు.