Daddy Movie Child Artist: ‘గుమ్మాడి.. గుమ్మాడి..’ అనే సాంగ్ వినిపిస్తే చాలు.. ఒక తండ్రికి తన కూతురు గుర్తుకు వస్తుంది. తండ్రి, కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపేందుకు వచ్చిన ‘డాడీ’ మూవీ ప్రేక్షకుల మనసును దోచేసింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఒక తండ్రిలా తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే ఆయన కూతురు ఓ చిన్నారిన ముద్దులొలికే మాటలతో ఇంప్రెస్ చేసింది. ఈ పాపను చూసి అప్పట్లో ఈమె చిరంజీవి రియల్ కూతురా? అని చర్చించుకున్నారు. అయితే ఆ తరువాత ఈ పాప ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అని చాలా సందర్భాల్లో చర్చించుకున్నారు. అయితే చిన్నారిగా కనిపించిన ఈ పాప ఆ తరువాత సినిమాల్లో కనిపించలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె లేటేస్ట్ ఫొటోస్ చూసి షాక్ అవుతున్నారు.
డాడి సినిమాలో నటించిన అమ్మాయి పేరు అనుష్క మల్హోత్ర. లోకం గురించి పూర్తిగా తెలియని వయసులోనే ఆమె రెండు పాత్రలు చేశారు. ఓ వైపు అక్షయగా.. మరోవైపు ఐశ్వర్యగా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి, సిమ్రాన్ ల కూతురుగా నటించిన ఈమె వారితో పాటు అనుష్క కూడా హైలెట్ గా నిలిచారు. వాస్తవానికి సినిమా మొత్తం ఈమె చుట్టే తిరుగుతూ ఉంటుంది. దీంతో ఈమె ఆ తరువాత పెరిగి పెద్దయ్యాగా హీరోయిన్ అవుతారని అనుకున్నారు.
చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు చిన్నప్పుడు సినిమాల్లో నటించి ఆ తరువాత హీరోయిన్ రాణిస్తున్నారు. కానీ అనుష్క మాత్రం ఇండస్ట్రీ వైపు చూడడం లేదు. అయితే డిగ్రీ పూర్తయిన తరువాత మల్హోత్రా కన్నడ సినిమాకు కమిట్ అయింది. అయితే ఆ సినిమా వివరాలు బయటకు రాకపోవడంతో ఆ వార్తలు నిజమో కాదో తెలియడం లేదు. కానీ ఈ మధ్యలో అనుష్క తన లేటేస్ట్ పిక్స్ తో మాత్రం అలరిస్తోంది.
ఈ పిక్ లో మల్హోత్ర పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన అనుష్క ను సినిమాల్లో చూడాలని ఉందని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ భామ మిగతా హీరోయిన్ల లాగా తన పర్సనల్ విషయాలను బయటకు రానివ్వడం లేదు. అయితే అనుష్క మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఫీల్డ్ ఎంట్రీ ఇస్తే మిగతా హీరోయిన్లకు పోటీ ఇవ్వడం గ్యారంటీ అని చర్చించుకుంటున్నారు.