
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాప్ లేకుండా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. అయితే, పవన్ ఇలాగే ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడు? ఇప్పటికే అర డజన్ సినిమాలు ప్రకటించేందుకు పవన్ నిర్మాతలు క్యూలో ఉన్నారంటేనే.. పవన్ ఏ రేంజ్ స్పీడ్ లో ఉన్నాడో అర్ధం అవుతుంది. కేవలం, తానూ డబ్బుల కోసమే సినిమాలు చేస్తున్నానని పవన్ చాల ఓపెన్ గా చెప్పాడు. అందుకే నిర్మాతలు కూడా పవన్ ను భారీ రెమ్యునరేషన్ తోనే ఒప్పిస్తున్నారని తెలుస్తోంది.
Also Read: ఎన్టీఆర్ ‘ఐదు కోట్ల కారు’ ఆమె కోసమే !
అందులో భాగంగా బండ్ల గణేష్ అయితే, ‘నేను పేరుకే నిర్మాతను లాభాలు అన్ని మీవే’ అంటూ పవన్ నుండి డేట్స్ సంపాధించాడట. నిజానికి పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఒప్పుకోవాలంటే చాలా తతంగం ఉంటుంది. పైగా పవన్ కళ్యాణ్ కి చెప్పకుండా అనౌన్స్ మెంట్ లు, లీకులు ఇస్తే పవన్ కి అది అసలు నచ్చదు. కానీ బండ్ల గణేష్ ఆ మధ్య ట్వీట్ చేస్తూ పవన్ తో సినిమా అని ప్రకటించేశాడు. దాంతో పవన్, బండ్లకి సారీ చెప్పేశాడు అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్. అయితే తాజాగా బండ్ల మళ్ళీ పవన్ ను కలిసి సినిమా లాభాలు అన్ని మీవే అంటూ మళ్ళీ పవన్ ను సినిమా చేయడానికి ఒప్పించాడట.
Also Read: అయ్యో.. ప్లాప్ హీరోకి ఇరవై కోట్లు నష్టం !
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రియారిటీ లిస్ట్ లో ఇప్పటికే చాలామంది దర్శకులు, నిర్మాతలు ఉన్న సంగతి తెలిసిందే. మరీ వాళ్ళందరిలో ముందుగా ఎవరితో సినిమా చేస్తాడో ఎవరికి తెలియదు. అయితే ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమా పూర్తి అయింది. అలాగే పవన్ – రానా కాంబినేషన్ లో రానున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఆల్ రెడీ క్రిష్ తీస్తున్న పీరియడ్ మూవీ సెట్స్ పై ఉంది. హరీష్ శంకర్ తో చేయబోతున్న సినిమా కూడా వచ్చే నెల నుండి సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఆ తరువాత బండ్లతో సినిమా ఉంటుందట. ఈ సినిమాకి పూరి దర్శకుడు అని టాక్.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్