https://oktelugu.com/

Sonu Sood: రియల్ హీరో సోనుసూద్ ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Sonu Sood: ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలో నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నటులలో సోనుసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన సినిమాలలో విలన్ పాత్రలో నటించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం హీరో అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో భయంకరమైన కరోనా మహమ్మారి సమయంలో నేనున్నా అంటూ ప్రతి ఒక్కరికి భరోసా కల్పించి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఇతర ప్రాంతాలలో బందీ అయిన వలస కార్మికులను తన సొంత డబ్బులతో వారందరిని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 22, 2021 / 01:48 PM IST
    Follow us on

    Sonu Sood: ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలో నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నటులలో సోనుసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన సినిమాలలో విలన్ పాత్రలో నటించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం హీరో అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో భయంకరమైన కరోనా మహమ్మారి సమయంలో నేనున్నా అంటూ ప్రతి ఒక్కరికి భరోసా కల్పించి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఇతర ప్రాంతాలలో బందీ అయిన వలస కార్మికులను తన సొంత డబ్బులతో వారందరిని వారి స్వగ్రామాలకు చేర్చారు.

    Sonu Sood

    Also Read: రాజేంద్ర ప్రసాద్ “సేనాపతి” వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ?

    ఇలా కరోనా మొదటి రెండవ దశలో ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టే అందరి పాలిట దేవుడిగా నిలబడిన నటుడు సోను సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికి ఎవరైనా ఆపదలో ఉన్నామని అతనిని అభ్యర్థిస్తే చాలు వెంటనే వారికి ఆర్థిక సహాయం చేసి వారిని రక్షించడానికి సోనుసూద్ ముందు వరుసలో ఉంటారు. ఇలా సోనుసూద్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే అతను పంజాబ్ లో జన్మించి సినిమా పై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

    ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన సోనుసూద్ అన్ని భాషలలో సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారని తెలుస్తోంది. కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ సోనుసూద్ రెండు చేతులా సంపాదిస్తున్నారు. కరోనా తర్వాత ఈయనకు భారీ డిమాండ్ పెరిగిపోయింది.ఈ క్రమంలోనే ఒక సినిమాలో నటించడం కోసం సోనుసూద్ దాదాపు రెండు నుంచి మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్న సోనుసూద్ సుమారు 130 కోట్ల ఆస్తి సంపాదించారని తెలుస్తోంది. ఇలా సంపాదించిన డబ్బులతో ఎంతోమంది పేదవారి అవసరాలకు చారిటబుల్ ట్రస్ట్ లకు ఉపయోగిస్తూ అందరి మన్ననలు పొందుతూ రియల్ హీరో అనిపించుకున్నారు.

    Also Read: ఇక ఫ్యామిలీ మ్యాన్ పై చర్చ అనవసరం !